టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు 151 సినిమాలు చేశాడు.ఈ సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించాడు.
అద్భుత డాన్స్, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఈ స్టార్ హీరో సైతం పలు సినిమాలు మొదలు పెట్టి తప్పుకున్నాడు.ఇంతకీ ఆయన ఏ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వద్దనుకున్నాడో ఇప్పుడు చూద్దాం.
అబు బాగ్దాద్
అప్పట్లో భారీ అంచనాలు పెంచిన సినిమా అబు బాగ్దాద్.సినిమా షూటింగ్ పూర్తియ్యింది.పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.కమ్యునల్ కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
భూలోక వీరుడు
సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సోసియో ఫ్యాంటసీ మూవీ స్టార్ట్ అయ్యింది.కారణాలు ఏంటో తెలియదు కానీ మధ్యలోనే ఆగిపోయింది.
వజ్రాల దొంగ
శ్రీదేవి హీరోయిన్ గా నటించడంతో పాటు ప్రొడ్యూసర్ గా చేసిన ఈ సినిమా షూటింగ్ మొదలైంది.పలు కారణాల వల్ల ఈ సినిమాకు బ్రేక్ పడింది.
వినాలని ఉంది
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఊర్మిళ, టబు హీరోయిన్లు.షూటింగ్ పూర్తయ్యింది.
ఆడియో కూడా విడుదల అయ్యింది.ఎందుకో సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.
వడ్డి కాసుల వాడు
1990లో ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.కానీ సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమా ఆగిపోయింది.
వీఎన్ ఆదిత్య మూవీ
మనసంతా నువ్వే, నేనున్నాను సినిమాల దర్శకుడు వీఎన్ ఆదిత్యతో చిరుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.కానీ మొదలవకుండానే ఆగిపోయింది.
ఆంధ్రావాలా
జూనియర్ ఎన్టీఆర్ హిట్ కొట్టిన ఈ సినిమా కథ మొదట చిరంజీవికే చెప్పాడు పూరీ జగన్నాథ్.కానీ మెగాస్టార్ ఎందుకో నో చెప్పాడు.
ఆటో జానీ
పూరీ జగన్నాథ్ ఈ సినిమా స్టోరీ చెప్పాడు.చిరు ఓకే చెప్పాడు కానీ కొన్ని మార్పులు చేయాలన్నాడు.అందుకు పూరీ నో చెప్పడంతో చిరు సినిమా చేయన్నాడు.