పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా పరంగా కలెక్షన్లపరంగా తొలివారం కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.దాదాపు 90 కోట్ల టార్గెట్ తో రిలీజైన వకీల్ సాబ్ తొలి వారమే దాదాపు 95 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.
ఏపీలో టికెట్ రేట్లను తగ్గించినా ఆ ప్రభావం వకీల్ సాబ్ మూవీ కలెక్షన్లపై పడలేదనే చెప్పాలి.ప్రపంచవ్యాప్తంగా తొలి వారం వకీల్ సాబ్ సినిమాకు 95.3 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
ఈ కలెక్షన్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే ఏకంగా 82.4 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావడం గమనార్హం.నైజాంలో వకీల్ సాబ్ 28.2 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించగా సీడెడ్ లో 13.1 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 11.6 కోట్ల రూపాయలు, ఉభయ గోదావరి జిల్లాల్లో 13.7 కోట్ల రూపాయలు, గుంటూరులో 7.2 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 4.9 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 3.8 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
ఓవర్సీస్ లో ఈ సినిమాకు 6.4 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా కర్ణాటక, ఇతర ప్రాంతాల కలెక్షన్లు 6.5 కోట్లు కావడం గమనార్హం.మూడేళ్ల విరామం తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.మరోవైపు పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు కరోనా సోకినట్టు ధృవీకరించింది.ప్రస్తుతం యాంటీ వైరల్ మందులతో పవన్ కళ్యాణ్ కు చికిత్స జరుగుతోందని సమాచారం.
పవన్ కళ్యాణ్ కు కరోనా నిర్ధారణ అయినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్య నిపుణులు చెందుతున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని పలువురు హీరోలు కరోనా బారిన పడి వైరస్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.
పవన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.