నేటి కాలపు మహిళలకు ఆదర్శం.. టెన్త్ చదివి నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తుంది. ఎలాగంటే.. ?

ఉపాయం ఉంటే అపాయం నుండి తేలికగా తప్పించుకోవచ్చనే సామేత అందరికి తెలిసిందే.అలాగే లక్షల్లో జీతాలు తీసుకోవాలంటే పీజీలు, డాక్టర్లు వగైరా వగైరా చదువులు చదవ వలసిన అవసరం లేదు.

 Tenth Class Read Earnings Rs 2 Lakh Per Month, Karnataka, Bangalore, Nandini Ten-TeluguStop.com

అలాగని రాజకీయాల్లోకి ప్రవేశించవలసిన అవసరం కూడా లేదు.మరి ప్రస్తుత రోజుల్లో తక్కువ చదువులు చదివి ఎక్కువ సంపాదన పొందడం ఎలాగంటారా.

అయితే ఈ వార్త మీకోసమే.ఒక మహిళ నిజ జీవితంలో ఎదిగిన స్పూర్తిదాయకమైన సమాచారం గురించి తెలుసుకుంటే.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన నందిని(33) అనే మహిళకు, వైద్యురాలిగా స్థిరపడాలనే ఆశ ఉండేదట.కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో టెన్త్ క్లాస్ వరకే చదివి స్కూల్ మానేసిందట.

ఈ క్రమంలో నందినికి వివాహం కూడా చేశారట.అంతలోనే నందిని తండ్రి మరణించడంతో ఆమె చెల్లెలి పెళ్లి భారం భుజాన ఎత్తుకున్న నందినికి క‌ష్టాలు ఎదుర‌య్యాయి.

ఒక వైపు చాలీచాలనీ భర్త సంపాదన, తానూ కష్టపడిన అది ఏ మూలకూ స‌రిపోయేది కాదట.ఈ నేపధ్యంలో ఊబ‌ర్ సంస్థ గురించి తెలుసుకున్న నందిని, తన భర్తతో కలసి త‌మ వ‌ద్ద ఉన్న న‌గ‌లు తాక‌ట్టు పెట్టి ట‌యోటా కారు కొని ఊబ‌ర్‌లో తిప్ప‌డం స్టార్ట్ చేశారట.

అంతే కాకుండా ఊబ‌ర్ సంస్థ‌కు ఎవ‌రినైనా క్యాబ్ డ్రైవ‌ర్ల‌ను రిఫ‌ర్ చేస్తే వారికి రిఫ‌ర‌ల్ అమౌంట్‌ను ఇస్తుందట ఆ కంపెనీ.దీంతో నందిని ఆమె భ‌ర్తతో కలిసి ఓ చిన్న‌ ఆఫీస్ పెట్టి ఇప్ప‌టి వ‌ర‌కు 600 మంది డ్రైవ‌ర్ల‌ను ఊబ‌ర్‌లో చేర్పించారట.

దీంతో ఒక్క‌సారిగా ఆమె ఆదాయం కూడా పెరిగింది.ఇప్పుడు నెల‌కు ఆమె సంపాదన రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు వస్తుందట.మెుత్తానికి టెన్త్ క్లాస్ చదివిన నందిని తన తెలివితేటలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించడమే కాదు నేటికాలపు మహిళలకు ఆదర్శంగా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube