విజయ్ సేతుపతి డబ్బింగ్ వెనుక అసలు కథ ఇదా..?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఉప్పెన సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా విజయ్ సేతుపతి వాయిస్ పై మాత్రం నెగిటివ్ కామెంట్స్ వ్యక్తమయ్యాయి.

 Uppena Director Buchibabu Sana Clarity About Vijay Setupati Voice , Bommali Ravi-TeluguStop.com

విజయ్ పాత్రకు వాయిస్ సూట్ కాలేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 96 సినిమాలో సాఫ్ట్ గా కనిపించిన విజయ్ సేతుపతి ఈ సినిమాలో తనలోని విలనిజంను చూపించబోతున్నారు.

అయితే ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సన ఉప్పెన ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఉప్పెన సినిమా కథ విని కథలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి ఈ పాత్రకు తన వాయిస్ మాత్రం సూట్ కాదని చెప్పారని దీంతో ఈ పాత్రకు డబ్బింగ్ కొరకు చాలామందిని సంప్రదించామని తెలిపారు. సాయికుమార్ సోదరుడు బొమ్మాళీ రవిశంకర్ ను చివరకు ఈ పాత్ర కోసం ఎంపిక చేశామని.

ఆయనే విజయ్ సేతుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పాడని తెలిపారు.

Telugu Buchibabu Sana, Uppena, Vijay Setupati-Movie

సాధారణంగా బొమ్మాళీ రవిశంకర్ ఏ సినిమాకైనా, ఎలాంటి పాత్రకైనా ఒక్కరోజులోనే డబ్బింగ్ చెబుతాడని.కానీ సినిమా చూసిన తరువాత డబ్బింగ్ కోసం మూడు రోజులు కేటాయించాడని తెలిపారు.సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర భయపెట్టేలా ఉందని.

ఆ వాయిస్ అయితేనే విజయ్ సేతుపతి పాత్రకు కరెక్ట్ అని బుచ్చిబాబు సన చెప్పారు.ట్రైలర్ లో ఆకట్టుకోలేకపోయిన వాయిస్ సినిమాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.

తెలుగులో రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా తమిళంలో కూడా త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది.ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube