తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆరోపణలు చేశాడు.తెలంగాణలో శాంతి భద్రతల సమస్య ఉందని తెలిసి కేసిఆర్ చేతులు ఎత్తేశాడు.
కొంతమంది పోలీసులు, ప్రభుత్వం పోషించాల్సిన పాత్రను పోషిస్తున్నారు.భారతీయ జనతా పార్టీ పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు.
తెలంగాణ ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను బ్రష్ఠు పట్టిస్తున్నాడు అన్నారు.కేసిఆర్ కి నిజమైన దమ్ము ధైర్యం, దేశ భక్తి తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ఒక్క 15 నిమిషాలు పోలీసులకు స్వేచ్చ ఇచ్చి చూడాలి అన్నారు.
ఐపిఎస్ వ్యవస్థను కేసిఆర్ నాశనం చేస్తున్నాడు.ఎంతో నిజాయితీగా పనిచేసే ఐపిఎస్ అధికారులు ఉన్నారు.
అలాంటి వారికి స్వేచ్చ నిచ్చి చూస్తే సంఘ విద్రోహశక్తులను పట్టుకొని చట్టానికి అప్పజెప్పుతారు.ఆ దైర్యం రాష్ట్ర ముఖ్య మంత్రికి ఉందా అంటూ ప్రశ్నించాడు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, రోహింగ్యాలు, ఎంతో మంది అక్రమంగా వచ్చి ఉంటున్నారు.అలాంటి వారిని పట్టుకునే దమ్ము కేసిఆర్ కు ఉందా అంటూ బండి సంజయ్ ప్రశ్నించాడు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండాల్సిన చోట రిటైర్డ్ అధికారులను తీసుకువచ్చి వారితో అడ్డగోలుగా కోట్ల కోట్లకు కేసిఆర్ పార్టీ ఫండ్ పేరుతో సంపాదిస్తున్నాడు.పదవి విరమణ పొందిన అధికారులు చెయ్యాలిసిన పని చేయకుండా టిఆర్‌ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తు పార్టీని బలోపేతం చేస్తున్నారని బండి సంజయ్ అన్నాడు.