అరటి ఆకులలో ఏ విధంగా వడ్డించాలో మీకు తెలుసా?

అరటి ఆకులలో భోజనం చేయడం మన భారతీయ సంప్రదాయాలలో ఒక భాగంగా ఉండేది.పూర్వకాలం బ్రాహ్మణులు, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారికి అరటి ఆకులలో భోజనం పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది.

 Do You Know How To Serve On Banana Leaves,banana Leaves,food Serve On Banana Lea-TeluguStop.com

ప్రస్తుతం మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా వ్రతాలు నిర్వహించినప్పుడు ఈ అరిటాకులను వాడడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తుంది.అరిటాకులో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలిసిందే.

అయితే అరిటాకులలో ఏ విధంగా వడ్డించాలి? ముందు ఏ ఆహార పదార్థాలను వడ్డించాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…

అన్నం తినడం అనేది కేవలం కడుపు నింపుకోవడం కోసం అనుకుంటే పొరపాటు పడ్డట్టే.సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన ఆహారాన్ని పరమ పవిత్రమైనదిగా భావించాలి.

ఇంతటి పవిత్రమైన ఆహారాన్ని తినాలి అంటే కొన్ని నియమాలను పాటించాలి.ముఖ్యంగా అరటి ఆకులో భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేద పండితులు చెబుతున్నారు.

అరటి ఆకులు వేసేటప్పుడు ఆకుకి ఉన్న ఈనె తొలగించ కూడదు.ఈ ఈనె ఎప్పుడు ఆకు ఎడమ భాగం వైపు ఉండేలా చూసుకోవాలి.ఆకు కుడి వైపు భాగంలో పాయసం లేదా ఏదైనా తీపి పదార్థాలను వడ్డించాలి.తరువాత ఆకు ఎదురుగా కూరలు, మధ్యలో అన్నం వడ్డించాలి.

కుడివైపు పాయసంతో పాటు, పప్పును కూడా వేయాలి.ఎడమవైపు మిగతా పిండి వంటలు,చారు, చివరిగా పెరుగును వడ్డించాలి.

ఇవి అరటి ఆకులలో భోజనం చేసేటప్పుడు వడ్డించాల్సిన నియమాలు.

ఎప్పుడు కూడా ఆహారం వడ్డించక ముందు ఉప్పును వేయకూడదు.అంతేకాకుండా ఉప్పు ఒక్కదానిని మాత్రమే ప్రత్యేకంగా వడ్డించకూడదు.ఆహారం తిన్న తరువాత నెయ్యి ,పాయసాన్ని అసలు వేసుకోకూడదు.

ఏదైనా తీపి పదార్థాన్ని ఆహారం తినకముందే వడ్డించుకోవాలి.అంతేకాకుండా అమావాస్య, పౌర్ణమి రోజులలో రాత్రిపూట అరటి ఆకులపై భోజనం చేయరాదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube