పుత్ర సంతానంగా ఎవరు పుడుతారో మీకు తెలుసా?

ఎవరికైనా కొడుకు పుడితే ఎంతో సంతోషిస్తారు.వారి ఇంటికి వారసుడొచ్చాడని తెగ సంబరపడిపోతూ ఉంటారు.

 Do You Know Who Will Born As A Son, Born As Boy,boy,performs Duties Properly,rev-TeluguStop.com

మనిషి జీవితంలో సంతానం అన్నది ఎంతో అపురూపమైనది.అటువంటి సంతానం కోసం ఎంతో మంది ఎన్నో కలలు కంటూ ఎదురు చూస్తారు.

మరికొంతమంది సంతానం కోసం పూజలు, వ్రతాలు, నోములు , దానధర్మాలు చేస్తారు.కానీ శాస్త్రం ప్రకారం ఒక కుటుంబంలో కొడుకులుగా ఎవరు జన్మిస్తారో ఇక్కడ తెలుసుకుందాం…

ఈ జన్మలో మనకు పుత్రులుగా జన్మించిన వారు పూర్వజన్మలో ఎవరికైనా కొంత డబ్బును దాచి పెట్టమని చెప్పి ఒక వ్యక్తికి ఇచ్చి ఉంటాడు.

కానీ ఆ వ్యక్తి నుంచి ఆ డబ్బును తిరిగి పొంద కుండానే మరణించిన వారు, తిరిగి మరో జన్మలో పుత్రులుగా ఆ ఇంటిలో జన్మించి, వారు ఇచ్చిన సొమ్మును తిరిగి వారికి చెల్లించడానికి ఆ ఇంట్లో పుత్రునిగా జన్మిస్తాడని శాస్త్రం చెబుతోంది.

పూర్వజన్మలో ఎవరికైతే అపకారం చేసి ఉంటారో, దానికి ప్రతీకారం తీర్చుకోకుండా మరణించి, తరువాత జన్మలో అపకారం చేసిన వారికి పుత్రులుగా జన్మించి అందుకు ప్రతీకారం తీర్చుకుంటారు.

అంతే కాకుండా పూర్వజన్మలో తాను అనుభవించిన సుఖాలకు బదులుగా ఆ తల్లిదండ్రులకు సేవ చేయడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.

పూర్వజన్మలో ఏమీ ఆశించకుండా ఈ జన్మలో పుత్రునిగా జన్మించి తన విధులను, కర్తవ్యాలను సక్రమంగా తీరుస్తాడు.

ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారంగా వారు నిర్వహించే విధులు పూర్తిచేసుకుని మరణం పొందుతారు.మన కుటుంబం లో నివసించేవారు, జంతువులు మొదలైనవి కూడా కర్మ రుణం తీర్చుకోవడానికి మన దగ్గర నివసిస్తుంటాయి.

వారి రుణం తీరగానే అక్కడి నుంచి వెళ్లి పోవడం లేదా, మరణించడం జరుగుతుంది.ఇలా పుత్రులుగా జన్మించి వారికి సంబంధించిన ఈ విషయాలను గురించి మన హిందూ ధర్మంలో కచ్చితంగా తెలుసుకోవచ్చు.

Do You Know Who Will Born As A Son, Born As Boy,boy,Performs Duties Properly,Revenge,In Ancestry - Telugu Born Boy, Ancestry, Perms Properly, Revenge

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube