ఇతను ఒకప్పుడు పోలీస్... కానీ ఇప్పుడు?

సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు కొందరి వేషధారణ చూసి వారిని తక్కువగా భావిస్తారు.కానీ వారి గురించి తెలిసాక అయ్యో… ఇతని గురించి ఇలా అనుకున్నామని ఫీల్ అవుతూ ఉంటాము.

 Police Officer Turns As Beggar In Gwalior, Gwalior, Dayathi, Police As Beggar, G-TeluguStop.com

ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఉంటాయి.అయితే ఇలాంటి సంఘటన ప్రస్తుతం ఒక్కటి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.

అతను ఒక పోలీస్ ఆఫీసర్,1999 బ్యాచ్ పోలీస్ అధికారులు.

ఎన్నో పోలీస్ స్టేషన్లలోఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు.చివరగా 2005 వ సంవత్సరం దయాతి లో తన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, అతని మానసిక పరిస్థితి దిగజారిపోయింది.

అతని కుటుంబ సభ్యులు అతనికి మెరుగైన చికిత్స అందించిన ఎటువంటి ఫలితం లేకుండా ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు.అతని కోసం ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది.

Telugu Dayathi, Gwalior, Gwalior Dsp, Mind, Beggar, Turnsbeggar-Latest News - Te

ప్రస్తుతం ఆ పోలీస్ అధికారి ఒక యాచకుడిగా చలికి వణుకుతూ,గ్వాలియర్‌ డీఎస్పీ కంట్లోపడ్డాడు.గ్వాలియర్‌ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డీఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ పోలీసు వాహనంలో భదౌరియా ఝాన్సీ రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో అతనికి రోడ్డుపై చలితో వణుకుతున్న ఓ యాచకుడు కనిపించాడు.వెంటనే తన వాహనాన్ని ఆపి ఆ యాచకుడికి చలి కోటు ఇవ్వడానికి వెళ్ళాడు.అయితే యాచకుడుని చూసిన డీఎస్పీ ఒక్కసారిగా షాకయ్యారు.

ఆ వ్యక్తితో మాట్లాడుతున్న డీఎస్పీ రత్నేష్ సింగ్ అతని యాచకుడు కాదని తన బ్యాచ్ అధికారి అని తెలుసుకుని ఎంతో షాక్ అయ్యారు.గత పది సంవత్సరాలుగా అజ్ఞాతవాసంలో ఉన్న ఎస్పి ప్రస్తుతం ఇలా యాచకులుగా కనిపించడంతో ఆ వ్యక్తిని ఒక స్వచ్ఛంద సంస్థ దగ్గరకు తరలించారు.

అక్కడ పోలీస్ ఆఫీసర్ అయినా మనీష్ మిశ్రా సరైన వైద్యం పొందుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube