సుకుమార్ కారణంగానే పుష్పకు ఆ దెబ్బ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇటీవల షూటింగ్ ప్రారంభంచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Vijay Sethupathi, Pushpa, Allu Arjun, Sukumar-TeluguStop.com

ఇక ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్రలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే వార్తతో ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

కాగా ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.కానీ ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు తెలియడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు.

అసలు విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి ఎందుకు వెళ్లిపోయాడా అంటూ వారు సందేహం వ్యక్తం చేశారు.

అయితే విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి వాకౌట్ చేయడానికి కారణం సుకుమరే అని తెలుస్తోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో విలన్ పాత్రను తమిళంలో వేరేవారితో చేయించాలని కోరాడట.కానీ సుకుమార్ అందుకు అంగీకరించలేదట.

దీంతో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయాడట.మరి అతడి స్థానంలో ఎవరు నటిస్తారో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube