సుకుమార్ కారణంగానే పుష్పకు ఆ దెబ్బ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇటీవల షూటింగ్ ప్రారంభంచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్రలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే వార్తతో ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

కాగా ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

కానీ ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు తెలియడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు.

అసలు విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి ఎందుకు వెళ్లిపోయాడా అంటూ వారు సందేహం వ్యక్తం చేశారు.

అయితే విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి వాకౌట్ చేయడానికి కారణం సుకుమరే అని తెలుస్తోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో విలన్ పాత్రను తమిళంలో వేరేవారితో చేయించాలని కోరాడట.

కానీ సుకుమార్ అందుకు అంగీకరించలేదట.దీంతో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయాడట.

మరి అతడి స్థానంలో ఎవరు నటిస్తారో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

ఆ కమెడియన్ ను తలచుకుంటూ బ్రహ్మానందం ఎమోషనల్.. చూడటానికి రావద్దన్నాడంటూ?