యూకేలో భారత సంతతి వ్యక్తి మిస్సింగ్: డ్రోన్ల సాయంతో పోలీసుల గాలింపు

భారత సంతతి వ్యక్తి కోసం యూకే పోలీసులు డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.అతను చేసిన నేరం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.58 ఏళ్ల జస్వీర్ లీడర్‌ లీసెస్టర్‌ సిటీలోని తన ఇంటిని విడిచి పారిపోయాడు.అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నందున అతను ప్రతిరోజూ మందులు వేసుకోవాల్సి ఉంటుంది.

 Uk,leicestershire Police, Drone,indian-origin Man, Jaswir-TeluguStop.com

ఇళ్లు వదిలి వెళ్లిపోయేటప్పుడు అతను వాటిని తన వెంట తీసుకెళ్లలేదు.

దీంతో జస్వీర్ కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు.

రంగంలోకి దిగిన పోలీసులు 5 అడుగుల, 5 అంగుళాల పొడవు, సన్నగా ముదురు రంగు జట్టు, అద్దాలు పెట్టుకున్న అతని ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు లీసెస్టర్‌షైర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఇంటి నుంచి వచ్చిన సమయంలో లీడర్ ముదురు ఆకుపచ్చ బాంబర్ జాకెట్, ఉన్నితో చేసిన టోపీ, ముదురు రంగు ప్యాంట్, బూట్లు ధరించాడని పోలీసులు తెలిపారు.

Telugu Drone, Indian Origin, Jaswir, Leicestershire-

జస్వీర్ అదృశ్యమై గంటలు గడుస్తున్న కొద్దీ అతని క్షేమ సమాచారంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.లీడర్ ఆచూకీ కోసం తాము ఎంతో ఆందోళన చెందుతున్నామని, అతని జాడను కనుగొనేందుకు ప్రజల సహకారం కావాలని లీసెస్టర్‌షైర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.అతను ఎక్కడ ఉన్నాడో తెలిసినా.లేదా తాము చెప్పిన పోలికలు సరిపోయే వ్యక్తిని చూసినా వెంటనే తమను సంప్రదించాలని పోలీస్ అధికారులు తెలిపారు.మరోవైపు దర్యాప్తులో భాగంగా అధికారులు శనివారం చివరి సారిగా జస్వీర్ కనిపించిన విల్బర్‌ఫోర్స్ రోడ్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.అలాగే రోడ్లు, దుకాణాలలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube