ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమ ఆస్తుల కేసుని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇక ఈ కేసులో రెండు ముద్దాయిగా ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.
అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.ఈ నేపధ్యంలో ఈ కేసులో విచారణ నుంచి తమకి వ్యక్తిగత మినహాయింపు కావాలని సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఇక దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.ఈ కేసు నుంచి ఎలా అయిన బయట పడాలని తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా స్పష్టం చేసింది.ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని జగన్ తరఫు న్యాయవాదికి సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణలో ఉన్న వారు ఏ స్థాయిలో ఉన్న కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది.కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పుడు నేరానికి హోదాకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈనెల 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని తేల్చి చెప్పింది.