ఆధార్, పాన్ కార్డ్ ఉన్న ఎన్నారైలకి..డిసెంబర్ 31లోగా...

భారత దేశం నుంచీ విదేశాలకి వెళ్లి స్థిరపడిన ఎన్నారైలు ఎంతో మంది అక్కడ ఆర్ధికంగా స్థిరపడి, సొంత ప్రాంతాలలో ఆస్తుల కొనుగోలు చేయడం, అదేవిధంగా పారిశ్రామికాభివృద్దిలో భాగంగా పరిశ్రమలు నెలకొల్ప ఎంతో మంది భారతీయ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటారు.అయితే ఆస్తుల కొనుగోలు, లేదా అమ్మకాలు, మరియు పరిశ్రమల స్థాపనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్పనిసరి…అయితే

 Non Resident Indians Nris Must Link Their Pan Cards With Aadhaar Card-TeluguStop.com

ఇలా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉన్న ఎన్నారైలకి భారత ప్రభుత్వం ఓ సూచన చేసింది.

తమ పాన్ కార్డ్ ను ఆధార్ తో అనుసంధానం చేయాలని, ఒక వేళ అలా అనుసంధానం చేయని పాన్ కార్డ్ లు చెల్లుబాటు కావని తెలిపింది.ఈ మేరకు సంభందిత అధికారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

వాస్తవానికి ప్రవాస భారతీయులకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్పనిసరి కాదు కానీ ఆ రెండు ఉన్న వారు మాత్రం తప్పకుండా అనుసంధానం చేయాల్సిందేనని తెలిపారు.అంతేకాదు అందుకుగాను డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు.

ఒక వేళ ఈ విషయంలో అలసత్వం చేస్తే ఆర్ధిక లావాదేవీలు జరుపలేరని తెలిపారు.గతంలో సెప్టెంబర్ 30 వరకూ ఉన్న ఈ గడువుని డిసెంబర్ 31 వరకూ పొడిగించిన విషయం విధితమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube