అశ్వధ్ధామ టీజర్ టాక్ : గమ్యం తెలియని యుద్ధం

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వధ్ధామ’ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోంది.ఛలో వంటి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఆ తరువాత చేసిన సినిమాలేవీ అంతటి స్థాయిలో సక్సెస్‌ను అందించలేదు.

 Naga Shourya Ashwathama Teaser Released-TeluguStop.com

దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో నాగశౌర్య తానే స్వయంగా రాసిన కథను తన హోమ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ టీజర్ చూస్తుంటే మనోడు హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది.టీజర్ మొత్తంలో సినిమా కథను మనకు చూపించాడు హీరో.

వరుస హత్యలు చేసే విలన్ ఎవరనే విషయాన్ని బట్టబయలు చేసే పవర్‌ఫుల్ పాత్రలో నాగశౌర్య నటిస్తున్నాడు.ఈ సినిమాలో నాగశౌర్య మేకోవర్ చాలా బాగుంది.

టీజర్‌ను చాలా స్పీడుగా చూపిస్తూనే బ్యాక్‌గ్రౌండ్‌ నెరేషన్‌తో ఆకట్టుకున్నారు చిత్ర యూనిట్.ముఖ్యంగా ‘‘గమ్యం తెలియని యుద్ధం – ఆ యుద్ధం గెలవాలంటే ఒక అశ్వధ్ధాముడు రావాలి’’ అనే డైలాగ్ పీక్స్.

ఈ సినిమాతో నాగశౌర్య ఖచ్చితంగా హిట్ కొడతాడని అంటున్నారు టీజర్ చూసిన ప్రేక్షకులు.ఈ సినిమాలో నాగశౌర్యకు జంటగా మెహ్రీన్ పీర్జాదా నటిస్తోంది.ఈ సినిమాను రమణ తేజ అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.ఐరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube