అశ్వధ్ధామ టీజర్ టాక్ : గమ్యం తెలియని యుద్ధం

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వధ్ధామ’ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఛలో వంటి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఆ తరువాత చేసిన సినిమాలేవీ అంతటి స్థాయిలో సక్సెస్‌ను అందించలేదు.

దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో నాగశౌర్య తానే స్వయంగా రాసిన కథను తన హోమ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ టీజర్ చూస్తుంటే మనోడు హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది.

టీజర్ మొత్తంలో సినిమా కథను మనకు చూపించాడు హీరో.వరుస హత్యలు చేసే విలన్ ఎవరనే విషయాన్ని బట్టబయలు చేసే పవర్‌ఫుల్ పాత్రలో నాగశౌర్య నటిస్తున్నాడు.

ఈ సినిమాలో నాగశౌర్య మేకోవర్ చాలా బాగుంది.టీజర్‌ను చాలా స్పీడుగా చూపిస్తూనే బ్యాక్‌గ్రౌండ్‌ నెరేషన్‌తో ఆకట్టుకున్నారు చిత్ర యూనిట్.

ముఖ్యంగా ‘‘గమ్యం తెలియని యుద్ధం - ఆ యుద్ధం గెలవాలంటే ఒక అశ్వధ్ధాముడు రావాలి’’ అనే డైలాగ్ పీక్స్.

ఈ సినిమాతో నాగశౌర్య ఖచ్చితంగా హిట్ కొడతాడని అంటున్నారు టీజర్ చూసిన ప్రేక్షకులు.

ఈ సినిమాలో నాగశౌర్యకు జంటగా మెహ్రీన్ పీర్జాదా నటిస్తోంది.ఈ సినిమాను రమణ తేజ అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.

ఐరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

నాగబాబు వ్యాఖ్యలలో వాస్తవం లేదని తేల్చి చెప్పిన ఈసీ..!!