తెలుగు ప్రేక్షకులు దాదాపు ఏడు సంవత్సరాలుగా ఆధరిస్తున్న జబర్దస్త్ కామెడీ షో కష్టాల్లో పడింది.ఆ షో నుండి కొందరు కమెడియన్స్ వెళ్లి పోవడంతో పాటు మరి కొందరు ముఖ్యులు కూడా వెళ్లి పోయారు.
ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు ఎగ్జిట్ అవ్వడంతో పరిస్థితి మొత్తం తారు మారు అయ్యింది.నాగబాబు లేకపోవడంతో జబర్దస్త్ కామెడీ షో ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరో వైపు జబర్దస్త్ జడ్జ్ స్థానంను భర్తీ చేసేందుకు మల్లెమాల టీం వారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
చాలా మంది నాగబాబు వదిలేసిన ఆ సీటుపు కూర్చునేందుకు ఉర్రూతలూగుతున్నారు.కాని మల్లె మాల టీం వారు మాత్రం ఆ సీటుపై ఎవరిని కూర్చోబెట్టాలా అనే సందిగ్దంలో ఉన్నారు.చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని కూర్చోబెట్టే అవకాశం ఉందంటున్నారు.
మరో వైపు బుల్లి తెరకు చెందిన వారిని కూడా ఎంపిక చేయాలనుకునే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో మల్లెమాల వారు తీసుకున్న ఒక నిర్ణయం అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మల్లెమాల టీం ప్రస్తుతానికి నాగబాబు స్థానంను ఖాళీగానే ఉంచి రోజా ఒక్కదానితోనే షో ను నడిపించాలని భావిస్తున్నారు.నాలుగు అయిదు వారాల తర్వాత కొత్త జడ్జ్ను తీసుకు రావాలని అనుకుంటున్నారు.నిన్నటి వరకు నాగబాబు ఉండగా వెంటనే మరో జడ్జ్ వస్తే ఖచ్చితంగా తేడా కొట్టి షో పై ప్రభావం పడుతుంది.అందుకే కనీసం నెల రోజుల పాటు సింగిల్ జడ్జ్తోనే రన్ చేయాలని నిర్ణయించుకున్నారట.
మరి ఈ నిర్ణయం ఏమేరకు షో కు ఉపయోగపడుతుందో చూడాలి.