అమెరికా ఎఫ్ -15 ప్రాజెక్ట్ భారతీయుడు చేతికి

అవకాశాన్ని అందిపుచ్చుకోగల సత్తా ప్రపంచ వ్యాప్తంగా ఒక్క భారతీయుడికి మాత్రమే చెల్లింది అని చెప్పడంలో సందేహం లేదు.ఎందుకంటే భారతీయులకి ఎంతో గొప్ప విలువైన సంపద పూర్వీకుల నుంచీ వారసత్వంగా వచ్చింది అంటే అది కేవలం జ్ఞానం మాత్రమే.

 Indian Scientist Got The American F 15 Project-TeluguStop.com

అదే ఇప్పుడు ప్రపంచ దేశాలలో భారతీయుడికి పట్టం కడుతోంది.ఎన్నో ఎన్నో సంచలనాలని సృష్టిస్తున్నాడు విదేశాలలో కొలువు తీరుతున్న భారతీయుడు వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన అమెరికా యుద్ద విమానాలకి సంభందించిన ఒక కీలక ప్రాజెక్ట్ కి భారతీయ వ్యక్తికీ అప్పగించారు బోయింగ్ ఎఫ్ -15 యుద్ధవిమానాలు ప్రాజెక్ట్ కి అతడు కీలక నేతృత్వం వహిస్తున్నాడు.ఈ విషయాన్ని స్వయంగా అమెరికా బోయింగ్ సంస్థ ప్రకటించింది.ఆ భారతీయుడు పేరు ప్రత్యూష్ కుమార్.ఢిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్ధిగా కుమార్ ఎంతో చక్కని ప్రతిభావంతుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.

1989లో దిల్లీ ఐఐటీ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన కుమార్ అనంతరం మాస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ అందుకొన్నారు .యితే ప్రత్యూష్ అమెరికాతో పాటు ప్రపపంచ వ్యాప్తంగా ఎఫ్‌-15 వ్యాపార వ్యవహారాలు చూసుకుంటారని ఆ సంస్థ పేర్కొంది….ప్రస్తుతం కుమార్‌ బోయింగ్‌ భారతీయ విభాగం అధ్యక్షుడిగా నియమితులై ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube