ప్రతి రోజు మనం వేరు శనగ పప్పును ఎదో రకంగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం.పల్లీల చెట్నీని టిఫిన్స్ లో చేసుకుంటాం.
ఆ రుచి గురించి వేరే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వేరుశనగలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి.
అలాగే బెల్లంలో కూడా అనేక విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.ఈ క్రమంలోనే రోజూ గుప్పెడు వేరుశెనగలతో కొంచెం బెల్లం కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుప్పెడు వేరు శెనగ పప్పు, బెల్లంను కలిపి రోజూ తింటే రక్తం శుద్ధి అవ్వటమే కాకుండా రక్తం ఎక్కువగా తయారవుతుంది.రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఇది బాగా సహాయపడుతుంది.
రక్త సరఫరా బాగా జరగటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ చలి కాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.దగ్గు, జలుబు ఉన్నవారు ఈ రెండింటినీ కలిపి తింటే చాలా మంచిది.
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్యం బాగా పెరిగిపోయింది.ఈ కాలుష్యం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.ప్రతి రోజు గుప్పెడు వేరుశెనగలు, కొద్దిగా బెల్లం కలిపి తింటే కాలుష్యం బారి నుండి మరియు కాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.
చర్మం మృదువుగా, కాంతివంతంగా మారటంతో సహాయపడుతుంది.
చర్మంపై ఉండే మచ్చలు అన్ని తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది.
ఎదుగుతున్న పిల్లలకు వేరుశనగ,బెల్లం కలిపి తినిపిస్తే రోజంతా ఉషారుగా ఉంటారు.