రామాయణం ఎప్పుడు జరిగింది ఎవరికీ తెలియదు.కొందరు వేల సంవత్సరాల క్రితం అంటారు, కొందరు లక్షల సంవత్సరాల క్రితం అంటారు మరికొందరు అసలు రామాయణం జరగనే లేదు, అంతా ఉత్తుత్తి కథే అని అంటారు.
మనకు తెలిసినంతవరకు రామాయణం త్రేతాయుగంలో జరిగింది.మీతో ఎవరైనా అసలు రామాయణం జరగలేదు, రాముడు లేడు, రావణుడు లేడు అని వాదిస్తే, వారికి సమాధనమివ్వడానికి సమాచారం కావాలి కదా.అందుకోసమే రామాయణం నిజంగానే జరిగినట్టు నిరూపించే కొన్ని సాక్ష్యాలను మీ ముందుకి తెచ్చాం.అవేంటో చూడండి.
హనుమంతుడి పాదముద్రలు : హనుమంతుడు ఎంతటి బలశాలో మనం రామాయణంలో చదువుకున్నాం.హనుమంతుడు తన విశ్వరూపాన్ని దాల్చితే ఆయన ఎంత భారి ఆకారంలో ఉంటాడో కొన్ని కార్టూన్ సినిమాల్లో చూసాం.
ఆ ఆకారానికి సరిపడే పాదముద్రలు ప్రపంచ నలుమూలల ఉన్నాయి.శ్రీలంక, మలేసియా, థాయ్ లాండ్, చివరకి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి.ఇంత పెద్ద పాదముద్రలు ఎలాగో మనుషులవి కావు.మరి హనుమంతుడివే అయితే రామాయణం నిజంగా జరిగినట్టే కదా ?

2.రామసేతు:
రామాయణం చదివారా ? కనీసం సినిమా అయినా చూసారా ? చూసి ఉంటే మీకు రామసేతు వంతెన గురించి తెలిసే ఉంటుంది.అదేనండి .లంకను చేరుకోవడానికి వానర సైన్యం సముద్రంలో వంతెన కడుతుంది కదా.ఆ బ్రిడ్జ్ పేరే రామసేతు.ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జ్ 50 కిలిమీటర్ల విస్తీరణంలో తమిళనాడు.శ్రీలంక మధ్య ఉంది.దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటున్నారు.యుగాల ముందు కట్టినది కాబట్టి ఈ వంతెన చాలావరకు ధ్వంసం అయ్యిందని చరిత్రకారులు అంటారు.
3.మనుషులు కోతుల నుంచి వచ్చారు : మనుషులు కోతుల నుంచి వచ్చారని ఏంతోమంది సైంటిస్టులు నమ్ముతున్నారు.మనుషులు కూడా జంతువులే, నిప్పు కనిపెట్టాక బుద్ధి, జ్ఞానం పెంచుకొని ఇలా తయారయ్యానని శాస్త్రవేత్తల వాదన.కొన్ని మత గ్రంధాలు మనుషులు కోతుల నుంచి వచ్చారంటే నమ్మరు.
అది వేరే విషయం.పూర్వం చాలామంది మనుషులు కోతుల లాగా ఉండేవారు అంటే వానర సైన్యం నిజంగానే ఉన్నట్టుగా ?

4.నీటిలో తేలే రాళ్ళు :
లంక చేరుకునేందుకు వంతెన కడుతున్నప్పుడు ఎన్నో కస్తాలను ఎదుర్కుంటుంది వానర సేన.బండలు సముద్రరంలో మునిగిపోతుంటాయి.అప్పుడు ఆ బండలపై రామ అని రాసి సముద్రంలో వేస్తె అవి తెలుతూ ఉంటాయి.ఇలాంటి రాళ్ళు ఈ కాలంలో చాలానే బయటపడ్డాయి.అవి కూడా నీళ్ళలో తేలుతాయి.వాటిలో కొన్నిటి మీద రామ, राम అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది కూడా.
5.కోబ్రా హుడ్ కేవ్ :
శ్రీలంకలోని సిగిరియా అనే ప్రాంతంలో కోబ్రా హుడ్ కేవ్ అనే గుహ ఉంటుంది.ఇది వేల ఏళ్ల క్రితం నాటిదని, మనుషులు తవ్వినది మాత్రం కాదని చరిత్రకారులు చెబుతున్నారు.ఇది ఓ పాముని పోలి ఉంటుంది.దీని లోపల కొన్ని చిత్రాలు చెక్కి ఉంటాయి.సీతాదేవిని ఎలా బంధించారు అనే విషయం ఈ చిత్రాలను చూస్తే తెలుస్తుందట.

6.విజయదశమి – దీపావళి :
విజయదశమి ఎందుకు జరుపుకుంటారు ? అదేరోజు రావణుడిని శ్రీరాముడు హతమార్చాడు అనే కదా.మరి దీపావళి ఎందుకు జరుపుకుంటారు ? ఆరోజు శ్రీలంక నుంచి రాముడు అయోధ్యకి చేరుకున్నాడు అనే కదా.ఈ రెండు పండగల మధ్య గ్యాప్ ఎన్నిరోజులు ? 20 రోజులు.ఒక్కసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి శ్రీలంక నుంచి అయోధ్యకి కాలినడకన ఎన్నిరోజులు పడుతుందో చూడండి.గూగుల్ మ్యాప్ సరిగ్గా 21 రోజులు చూపిస్తుంది.రాముడు సీతను తీసుకొని కాలినడకన 21వ రోజున అయోధ్యకి చేరుకున్నాడు.ఆరోజే దీపావళి.
7.గోల్కొండ : పైన చెప్పిన విషయాలు నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపిస్తున్నాయేమో.ఇప్పుడు హైదరాబాద్ లో గోల్కొండా తెలుసుగా ? గోల్కొండ చరిత్ర తెలుసుగా ? గోల్కొండ వెళ్ళినప్పుడు రామదాసు బందిఖానా కూడా చూడండి.ఇప్పుడు రామదాసు చెక్కిన రాముడి రూపాలు ఇంకా అక్కడే ఉన్నాయి.
మరి బంధీగా ఉన్న రామదాసుని క్షమాపణ కోరి,ఇప్పుడున్న భద్రాచలం మందిరాన్ని ఒక ముస్లీం రాజు ఎందుకు కట్టించాడో మీకు తెలుసుగా ? రాముడి దర్శనం దొరికిందనే భద్రాచల మందిర నిర్మాణం జరిగిందిగా.మరి రాముడు ఉన్నప్పుడు రామాయణం ఉన్నట్టేగా !

ఇతర సాక్ష్యాలు :
హనుమంతుడు లంకాదహనం చేసిన సాక్ష్యాలు ఇంకా శ్రీలంకలో ఉన్నాయి.
రావణాసురుడు లంకను ఏలిన సాక్ష్యాలు ఉన్నాయి.
శ్రీలంకలో సీతాదేవిని బంధించిన అశోక వాటిక ఇంకా ఉంది.
రావణుడు కట్టిన వేడి నీళ్ళ బావులు ఇంకా ఉన్నాయి.
జటాయు మరణించిన లేపాక్షి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
హనుమంతుడు లంకలో నాలుగు దంతాల ఎనుగులని చూస్తాడు.నాలుగు దంతాల ఏనుగుల ఆనవాళ్ళు ఎప్పుడో దొరికాయి.
దునగిరిలో హనుమంతుడు లక్ష్మణుడిని కాపాడేందుకు ఎత్తిన సంజీవని పర్వతం ఉంది.