అక్షర చిట్ ఫండ్ ముందు బాధితుల ధర్నా

యాదాద్రి జిల్లా:భువనగిరి జిల్లా కేంద్రంలోని అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్లో చిట్టి డబ్బులు ఇవ్వడం లేదంటూ బాధితులు కార్యాలయం ధర్నా నిర్వహించారు.

గత కొన్ని నెలలుగా కట్టిన చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపించారు.

తమ పిల్లల చదువుల కోసం,శుభకార్యాల కోసం,భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశ్యంతో చిట్టి కడితే తాము కట్టిన డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ఈ అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై గతంలో కుడా అనేక ఆరోపణలు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు.

న్యాయం చేయాలంటూ అక్షర చిట్ ఫండ్ కు కార్యాలయానికి తాళాలు వేసిన బాధితులు.

రేపు వైన్ షాపులు మాంసం దుకాణాలు బంద్
Advertisement

Latest Nalgonda News