ఢిల్లీ ధ‌ర్నాపై కేసీఆర్ పున‌రాలోచ‌న‌

రాష్ట్ర హైకోర్టు విభ‌జ‌న వ్య‌వ‌హారంపై ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇత‌ర‌ స‌హ‌చ‌రుల‌తో క‌ల‌సి ధ‌ర్నాకి దిగాల‌న్న కేసీఆర్ యోచ‌న‌కు ఓ వైపు తెలంగాణ న్యాయ‌వాదులు హ‌ర్షం ప్ర‌క‌టిస్తున్నా, ఇది ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌ది తెరాస ్ర‌శేణులు చ‌ర్చ‌కు దిగ‌టంతో ధ‌ర్నా విష‌య‌మై పున‌రాలోచ‌న జ‌రుగుతున్న‌ట్టు భోగ‌ట్టా.

 Kcr Reconsider Dharna In Delhi-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే తెరాస ఎంపీలు మంగ‌ళ‌వారం కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌కి న్యాయాధికారుల నియామకాలపై గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్న విషయం వివ‌రించినా ఈ వ్య‌వ‌హారం త‌మ ప‌రిధిలోనిది కాదంటూ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ విష‌యాన్ని తెరాస ఎంపిలు కేసీఆర్‌కి చేర‌వేసారు.

ఇదే విష‌య‌మై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ కూడా ఘాటుగానే స్పందించారు.

జంతర్‌మంతర్‌ వద్ద కేసీఆర్‌ , కేజ్రీవాల్‌లా కేంద్రాన్ని విమర్శిస్తూ ధర్నా చేయదలచుకుంటే స్వాగతిస్తామని స్ప‌ష్టం చేసారు.హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిదిలో లేదని, ఉమ్మడి హైకోర్టులో ఉన్నందున చ‌ర్య‌లు తీసుకోలేమ‌ని స్పష్టం చేయ‌డంతో ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఢిల్లీలో ధ‌ర్నాకు దిగితే, తెలంగాణ‌లో రాజ‌కీయంగా మ‌రింత ఊపు తీసుకు రావ‌చ్చుకానీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి క‌ల‌సి వ‌చ్చే అంశం కాద‌ని విశ్లేష‌కులు చెప్ప‌డంతో కొంత వెన‌క‌డుగు వేసిన‌ట్లు తెలుస్తోంది.

ఓ వైపు కేంద్రం నుంచి ప‌లు ్ర‌పాజ‌క్టుల‌కు నిధులు సేక‌ర‌ణ‌, ఒప్పందాలు, అనుమ‌తులు విష‌య‌మై మం్ర‌తులను ఢీల్లీ పంపి, మ‌ళ్లీ సెంటిమెంట్ రాజకీయాలకు తెర‌లేప‌టంపైనా జ‌ర‌గ‌నున్న‌దేంటో అర్ధంకాని స్ధితిలోకి నెట్ట‌బ‌డిన‌ట్టు తెరాస ్ర‌శేణులే చెప్తున్నాయి.

హైకోర్టుని విభ‌జించాల‌న్న న్యాయ‌వాదుల పోరాటానికి ముఖ్య‌మం్ర‌తి మ‌ద్ద‌తు ఇస్తే త‌ప్పు లేదని, అయితే కోర్టుల ప‌రిధిలోని అంశాల‌ను రాజ‌కీయం చేసేందుకు కేసీఆర్ ధ‌ర్నాల దిశ‌గా అడుగులు వేస్తే, ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది.

మ‌రి కేసీఆర్ అడుగులు ఎటువైపు ప‌డ‌నున్నాయో చూడాలి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube