పవన్‌ కళ్యాణ్‌ ప్రెస్‌మీట్‌

తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా ఉన్న ఓటుకు నోటు విషయంలో పవన్‌ స్పందన ఏంటి అంటూ అటు వైకాపా, ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీలు తీవ్ర స్థాయిలో ఎండగడుతున్న నేపథ్యంలో ఇటీవలే ట్విట్టర్‌లో స్పందించాడు పవన్‌.ఏ విషయాన్ని తెగే వరకు లాగ వద్దంటూ ఈ విషయంపై ఇండైరెక్ట్‌గా స్పందించాడు.

 Pawan Kalyan Press Meet Over Cash For Vote Scam-TeluguStop.com

దాంతో మరింతగా పవన్‌పై విమర్శలు వస్తున్నాయి.పవన్‌ ముక్కు సూటిగా ఈ విషయంపై స్పందించాలి అంటూ వైకాపా నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

తాజాగా పవన్‌ ఈ విషయంపై మీడియా సమావేశం పెట్టి మరీ స్పందించాలని నిర్ణయించాడు.

ఈ వారం చివర్లో కాని, వచ్చే వారం మొదట్లో కాని పవన్‌ కళ్యాణ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ప్రెస్‌మీట్‌లో ఓటుకు నోటు విషయంలో స్పందించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ విషయంపై పవన్‌ ఎలా స్పందిస్తాడో అంటూ ఇప్పటికే రాజకీయ వర్గాలతో పాటు అభిమానుల్లో, సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.

గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు సపోర్ట్‌ చేసిన పవన్‌ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతాడా అనేది కూడా చూడాలి.ఇక ఈయన తన సినిమాల గురించి కూడా ఏమైనా ప్రకటన చేస్తాడా అనేది ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube