కాపులపై ' ముద్రగడ ' అస్త్రం సిద్దం చేస్తున్న వైసీపీ ?

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) రసవత్తరంగా ఉండబోతున్నాయి.అధికారం దక్కించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.

 Ycp Is Preparing 'mudragada' Astram On Kapu, Mudragada Padamanabam, Ysrcp, Ap Go-TeluguStop.com

జనసేన, బీజేపీ, టిడిపి( Janasena, BJP, TDP )లు ఉమ్మడిగా వైసిపి ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుండగా, ఏపీ అధికార పార్టీ వైసిపి ఒంటరిగానే అన్ని పార్టీలను ఎదుర్కొని, మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో సామాజిక వర్గాల వారీగా మద్దతు పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ముఖ్యంగా ఏపీలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లను పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నా యి.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Janasena chief Pawan Kalyan )తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా యాత్రను మొదలుపెట్టారు.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతోంది.ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గం ఓటర్లను తన వైపునకు తిప్పుకునే విధంగా పవన్ ప్రసంగాలు చేస్తున్నారు.కాపులంతా ఐక్యంగా ఉంటే తాను ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడిని, జగన్ కాపులను బీసీల్లో చేర్చలేని చెప్పినా, ఆయనకి 2019 ఎన్నికల్లో కాపులు మద్దతు పలికారని పవన్ ప్రసంగించారు.

Telugu Ap, Chandrababu, Kapu, Tdpjanasena, Ysrcp-Politics

తన వెంట ఉండివుంటే ఆ లెక్క వేరేగా ఉండేదని పవన్ అన్నారు.పవన్ కాపు అస్త్రాన్ని బయటకి తీయడంతో దానికి విరుగుడుగా వైసిపి ప్రయత్నాలు మొదలు పెట్టింది.కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) ను వైసీపీ( YCP )లో చేర్చుకునే వ్యూహం పన్నుతోంది.

ఇప్పటికే ఆయనతో మంతనాలు చేసిన వైసిపి కీలక నాయకులు ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరితే కీలకమైన పదవులు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు.ముద్రగడ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్, ముద్రగడ పద్మనాభం కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా వైసీపీ సిద్ధమనే వార్తలు వచ్చాయి.ముద్రగడను చేర్చుకోవడం ద్వారా, కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకురావచ్చు అని, ముద్రగడ తో ఎన్నికల ప్రచారం చేయిస్తే జనసేన, టిడిపిల దూకుడు కు బ్రేకులు వేయవచ్చనే ఆలోచనతో వైసిపి ఉంది.

Telugu Ap, Chandrababu, Kapu, Tdpjanasena, Ysrcp-Politics

కాపులంతా ముద్రగడ ప్రభావంతో ఐక్యంగా వైసీపీకి ఓట్లు వేస్తారా అనేది తేలాల్సి ఉంది.అయితే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం ప్రభావం ఎంతో కొంత ఉంటుందని, అదే తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనే ఆలోచనలో వైసీపీ ఉంది.పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడం, సీఎం కుర్చీ విషయంలో తనకు ఆసక్తి లేదు అన్నట్లుగా ఇటీవల కాలంలో ప్రసంగాలు చేయడం వంటివన్నీ కాపు సామాజిక వర్గంలో కాస్త అసంతృప్తిని కలిగిస్తున్నాయి.చంద్రబాబును( Chandrababu ) ముఖ్యమంత్రి చేసేందుకే పవన్ ఆరాటపడుతున్నారనే అభిప్రాయం కాపు సామాజిక వర్గంలో కనుక కలిగితే, అది వైసిపికి ఎక్కువ లాభం చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు ముద్రగడను చేర్చుకోవడం ద్వారా పవన్ వెంట వెళ్లాలనుకున్న కాపు సామాజిక వర్గంలో ఎంతో కొంత చీలిక తీసుకురావచ్చు అనే ఆలోచన తో వైసిపి ఉంది.ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube