పవన్ ప్రసంగాలపై టిడిపిలో టెన్షన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర( Varahi tour) ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.ఈ సందర్భంగా పవన్ అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తుండడంతో పాటు, వైసిపి ప్రభుత్వం పైన తనదైన విరుచుకుపడుతున్నారు.

 Tension In Tdp Over Pawan's Speeches In Varahi Tour , Pavan Kalyan, Janasena,-TeluguStop.com

పవన్ ప్రసంగాలు హైలెట్ అవుతుండడంతో జనసేన వర్గాల్లోనూ ఉత్సాహం కనిపిస్తుంది.పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు వారాహి యాత్రకు తరలివస్తుండడంతో, ఆ పార్టీలో జోష్ కనిపిస్తుంది.

పవన్ చేపట్టిన ఈ యాత్రపై అటు అధికార పార్టీ వైసిపి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం( TDP ) చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తోంది.పవన్ ప్రసంగాల్లోని పరమార్ధాలను వెలికి తీసే పనిలో పడ్డాయి.

ముఖ్యంగా పవన్ చేస్తున్న ప్రసంగాలపై తెలుగుదేశం పార్టీ ఎక్కువగా టెన్షన్ పడుతోంది.ఏపీ రాజకీయాల్లో తామే కీలకం కాబోతున్నాననే సంకేతాలను పవన్ ఇస్తుండడం తో పాటు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ అసెంబ్లీలో తాను కూర్చుంటానని పవన్ శపదాలు చేస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Pavan Varahi, Telugu

ఈ ప్రకటనలు టిడిపికి ఆందోళన కలిగిస్తున్నాయి.మొన్నటి వరకు పదవులు విషయంలో పట్టింపు లేదు ,అధికార పార్టీ వైసీపీ( YCP )ని గద్దె దంచడమే తన ఏకైక లక్ష్యం అంటూ పవన్ మాట్లాడారు.అయితే ఇప్పుడు పవన్ వ్యూహం మార్చడంతో, వేరే ఆలోచనతో ఉన్నారా ? కీలకమైన పదవి విషయంలో పవన్ పట్టుబట్టే అవకాశం ఉందా అనే అంశంపై టిడిపి విశ్లేషణ చేసుకుంటుంది.అవసరం అయితే విడిగా వస్తానని పవన్ మాట్లాడిన మాటలపైన టిడిపి ఆందోళన చెందుతుంది.

జనసైనికుల్లో జోష్ నింపేందుకు పవన్ ఆ తరహా ప్రసంగాలు చేశారని భావించినా, పవన్ ప్రస్తుత వ్యవహార శైలి చూస్తుంటే, సీఎం కూర్చి విషయంలో పేచీ పెట్టే అవకాశం ఉందనే అంచనాకు టిడిపి వస్తుంది.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Pavan Varahi, Telugu

ఒకపక్క వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోను చెబుతూనే, విడిగా వస్తాను, ఉమ్మడిగా వస్తాను అంటూ మాట్లాడడంతో టిడిపి తో పొత్తు విషయంలో పవన్ ఇంకా ఏ క్లారిటీకి రాలేదని, టిడిపి అంచనా వేస్తోంది.తన యాత్ర పూర్తి సర్వే రిపోర్ట్ లో నివేదికలను పరిశీలించి అప్పుడే టిడిపి తో పొత్తుకు వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారనే ప్రచారం పైన టిడిపి టెన్షన్ పడుతోంది.అందుకే పవన్ విడిగా వస్తాను, ఉమ్మడిగా వస్తాను అంటూ క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారని టిడిపి భావిస్తుంది.

దీంతో పవన్ చేపట్టిన వారాహి యాత్రకు వస్తున్న స్పందనను బట్టి పవన్ నిర్ణయాలు ఉండబోతుండడం తో ఎన్నికల సమయంలో పొత్తుల అంశంలో పవన్ ఏం చేస్తారనే భయం టిడిపిలో నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube