YS Jagan Raghurama Krishnamraju : రఘురామ కు టికెట్ లేనట్టేనా ? జగన్ సక్సెస్ అయ్యారా ? 

నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు( Narsapuram MP Raghurama Krishnamraju ) 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినా,  ఆ తర్వాత కొంతకాలానికి ఆ పార్టీ అధినేత జగన్ తో విభేదాలు ఏర్పడి, ఆ పార్టీకి దూరమై, తరచుగా వైసీపీని , ఆ పార్టీ అధినేత జగన్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూనే వస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి లేదా జనసేన పార్టీల( TDP Janasena ) నుంచి పోటీచేయాలని రఘురామ భావిస్తున్నారు.

 Ys Jagan Raghurama Krishnamraju : రఘురామ కు టికెట్ �-TeluguStop.com

ఈ మేరకు రెండు పార్టీల అధినేతలతోనూ సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు.అయితే టిడిపి ,జనసేన, బిజెపిలు ప్రస్తుతం కూటమిగా ఏర్పడడం , సీట్లు సర్దుబాటు చేసుకోవడంతో పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానం ను బిజెపికి కేటాయించారు.

దీంతో బీజేపీలో చేరి నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని,  టిడిపి జనసేన బిజెపి కలిసి పోటీ చేస్తుండడంతో తన విజయానికి డోకా ఉండదని రఘురామ అంచనా వేశారు.

Telugu Amith Shah, Ap Bjp, Ap, Jagan, Janasena, Krishnam Raju, Mdhi, Sapuram Mp,

ఈ మేరకు బిజెపి అగ్ర నేతల( BJP Senior Leaders ) వద్ద తనుకున్న పలుకుబడిన ఉపయోగించి నరసాపురం టికెట్ ను తనకి కేటాయించే విధంగా రఘురామ ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకు టికెట్ ఇవ్వకూడదని బిజెపిలోని కొంతమంది నేతలు అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్నారు.మొదటి నుంచి బిజెపిలో ఉన్నవారికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు .ఈ మేరకు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) సైతం బిజెపిలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని రఘురామకు టికెట్ దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారట .మొత్తంగా బిజెపి అధిష్టానం పెద్దలు సైతం రఘురామకు టికెట్ ను కేటాయించేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.తాజాగా ఈ వ్యవహారంపై రఘురామ స్పందించారు.బిజెపి అంతర్గత రాజకీయాల పైన ఆయన కామెంట్లు చేశారు.  తనకు ఎంపీ సీటు రాకుండా జగన్ తన కోవర్ట్ ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని రఘురామ మండిపడుతున్నారు.

Telugu Amith Shah, Ap Bjp, Ap, Jagan, Janasena, Krishnam Raju, Mdhi, Sapuram Mp,

నరసాపురం నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు బిజెపి కసరత్తు చేస్తుంది.గతంలో ఈ స్థానం నుంచి బిజెపి తరుపున ఎంపీగా దివంగత కృష్ణంరాజు( Krishnamraju ) పోటీ చేసి గెలుపొందారు.  దీంతో ఆయన కుటుంబ సభ్యుల్లోనే ఒకరికి టికెట్ కేటాయించే దిశగా బిజెపి అధిష్టానం ఆలోచన చేస్తూ ఉండడంతో  దీంతో రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కే ఛాన్స్ కనిపించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube