వైసీపీ- బీజేపీ మధ్య దూరం జగన్ కి లాభమేనా ?

బిజెపి( BJP ) అగ్ర నేతలు జెపి నడ్డా అమిత్ షా( JP Nadda Amit Shah ) ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ మీద ఎదురుదాడి చేశారు.శ్రీకాళహస్తి సభలో జేపీ నడ్డా విశాఖ వేదికగా అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ని తూర్పుర బట్టారు.

 Ycp Will Get Benifit From Bjp Stand , Ycp, Bjp, Jp Nadda Amit Shah, Andhra Pra-TeluguStop.com

ఇంతకన్నా అవనితిమయమైన ప్రభుత్వం లేదని, కుంభకోణాలు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అయితే బిజెపి విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మీడియా లో జరగాల్సినంత స్థాయిలో చర్చ జరగటం లేదని టాక్ వినిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ఆర్థికంగా ఈ స్థాయికి దిగజారి పోయిందంటే దానిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కన్నా కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎక్కువ ఉందని , రాష్ట్రం నిలదొక్కుకోవడం లో కీలక అంశాలైన ప్రత్యేక ఆర్థిక సాయం కానీ, ప్రత్యేక హోదా కానీ, రైల్వేకోచ్ లు కానీ వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం కాని ఇలా ఏ రకమైన సహాయం చేయకుండా కేవలం పన్నుల వాటాలో రాష్ట్ర వాటాను మాత్రమే ఇచ్చి ఆంధ్రప్రదేశ్కు చాలా చేశామని క్లెయిమ్ చేసుకున్నా నమ్మే పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కనిపించడం లేదు.

Telugu Andhra Pradesh, Central-Telugu Political News

తమ రాజకీయ అవసరాల కోసం వైసీపీతో ( YCP )తెర వెనక స్నేహం నడిపిందే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ వారి అభివృద్ధి మీద గానీ భాజపా ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యేక ఆసక్తి లేదని అందువల్లే ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు విలువ లేదంటున్నారు తెలుగు రాష్ట్రాల రాజకీయ విశ్లేషకులు ఒకరకంగా బిజెపికి దూరం జరగడం వల్ల వచ్చే ఎన్నికలలో వైసిపికి మంచే జరుగుతుందని మైనారిటీ వర్గాలు ,కమ్యూనిస్టులు ఇలా బిజెపిని విమర్శించే అన్ని వర్గాలు ఇప్పుడు వైసీపీకి దగ్గరవుతాయని అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ మీద ఆగ్రహం ఉన్న కొన్ని వర్గాల ఓటర్లు కూడా వైసిపి వైపు చూసే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీజేపీతో కొత్త స్నేహం కోసం చూస్తున్న తెలుగుదేశం పార్టీ కూడా పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube