ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో టోకరా.. మోసపోయిన చోటే సంపాదించాలని.. ?

సైబర్ నేరగాళ్లూ కొత్త కొత్త మోసాలతో ప్రజలను మోసం చేస్తున్న విషయం తెలిసిందే.ఎన్ని సార్లు పోలీసులు గానీ, మీడియా గానీ ఈ విషయంలో అవగహన కలిగిస్తున్న కనీస జ్ఞానం కూడా తెచ్చుకోకుండా సులువుగా మోసపోతున్నారు.

 Women Cheated By Online Trading Fraudsters In Hyderabad , Hyderabad, Online Tra-TeluguStop.com

కొందరు అవసరాలు తీరక మోసం చేస్తుంటే.మరి కొందరు జల్సాలకు అలవాటుపడి కోరికలు తీర్చుకోవడానికి మోసాలు చేస్తున్నారు.ప్రస్తుతం కూడా ఓ కొత్త తరహా మోసంతో ఓ మహిళ నుండి రూ.1.2 కోట్లు కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.

హైదరాబాద్‌ అబిడ్స్‌కు చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి, తాము ట్రేడింగ్‌లో భారీ లాభాలు అర్జించి పెడుతామంటూ నమ్మించి, రూ.1.2 కోట్లు నొక్కేసారట.అయితే ఈ కేసులో ఇద్దరు నిందితులు అయిన రాహుల్‌ సిరస్వాల్‌‌, మహేశ్‌దేవ్‌లను నాలుగు రోజుల కిందట హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇతనితో పాటుగా ఏర్పడిన ఒక గ్యాంగ్ ట్రేడ్‌ 24 పేరుతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి మోసాలకు తెరలేపారట.కాగా ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులను నోయిడాలో ఇన్‌స్పెక్టర్‌ హరిభూషన్‌ బృందం అదుపులోకి తీసుకొని, హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube