మద్యం అంటే మందుబాబులకు అమృతం వంటిది.పెళ్లాం పిల్లలు లేకుండా అయినా ఉంటారు కావచ్చు గాని మద్యం లేకుండా ఉండలేని మనుషులు కూడా ఉన్నారు.
అలాంటి మద్యానికి మన రాష్ట్రాల్లో ఉన్న విలువ గురించి తెలిసిందే.
అందుకే ప్రభుత్వాలు కూడా మద్యం పట్ల సానుకూలంగా ఉంటాయి.
ఇకపోతే రాజస్థాన్ సర్కారు ఇటీవల కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చింది.లాటరీ పద్ధతిలో వైన్ షాపులు కేటాయించే బదులు వేలం పద్ధతి పాటించాలని నిర్ణయించింది.
ఇందుగాను హనుమాన్ గఢ్ జిల్లా నోహర్ లోని ఓ వైన్ షాపు కోసం వేలం నిర్వహించగా, ఆ వేలంలో షాపు ధర ఏకంగా రూ.510 కోట్లు పలికిందట.అదీగాక ఈ వేలం పాట సుమారు 15 గంటల పాటు నిర్వహించగా, చివరికి కిరణ్ కన్వర్ అనే వ్యాపారి ఎవరు ఊహించని ధరకు ఈ వైన్ షాపును సొంతం చేసుకున్నాడట.
కాగా గతంలో ఇదే వైన్ షాపును లాటరీ పద్ధతిలో నిర్వహించగా రూ.65 లక్షలకే అమ్ముడైందట.ఈసారి మాత్రం వేలంలో ప్రారంభ ధర రూ.72 లక్షలుగా నిర్ణయించగా, క్రమక్రమంగా పెరిగిపోతూ చివరికి రూ.510 కోట్లకు ఫైనల్ ఆవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.