సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పూజ చేసిన అనంతరం ఇంట్లో అగర్బత్తిలను వెలిగిస్తాము.అదేవిధంగా ఎంతో సువాసన భరితమైన వాటితో దూపం వేయటం వల్ల మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు.
అయితే నిజంగా పూజ చేసిన తర్వాత దూపం తప్పనిసరిగా వేయాలా? లేకపోతే ఏం జరుగుతుంది? ధూపం వేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పూజ చేసిన తర్వాత సువాసన భరితమైన అగరబత్తీలతో దూపం వేయటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ వాతావరణం తొలగిపోతుంది.
శాస్త్రం ప్రకారం ధూపం వేయడం వల్ల ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది.అలాగే ధూపం నుంచి వెలువడే సువాసనకు దేవతలు తృప్తి చెందుతారని ఈ క్రమంలోనే వారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు.
అలాగే ఉదయం సాయంత్రం ఈ విధమైనటువంటి ధూపం వేయడం వల్ల మనలో ఏర్పడిన ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.