దర్శకుడు క్రిష్ పైన అలిగిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. ఎందుకు ?

సిరి వెన్నల సీతారామశాస్త్రి. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని గేయ రచయిత.

 Why Sirivennela Hurt By Director Krish, Sirivennela Seetarama Sastry, Krushnam V-TeluguStop.com

తన కలం నుంచి జాలువారిన ఎన్నో పాటలు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయాయి.అటు స్టార్ ఫిల్మ్ మేకర్ గా కొనసాగుతున్న క్రిష్.

సీతారామశాస్త్రి దగ్గర శిష్యుడిగా పని చేశాడు.అప్పుడు క్రిష్ దర్శకుడు కాలేదు.

శాస్త్రి శిష్యుడిగా కొనసాగుతూ సినిమా పరిశ్రమకు సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు.క్రిష్ దగ్గరున్న టాలెంట్ ను గుర్తించిన శాస్త్రి.

ఆయన ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడని చెప్పాడు.అంతేకాదు.

క్రిష్ ను స్నేహితుగా స్వీకరిస్తున్నట్లు చెప్పాడు.అటు క్రిష్ సైతం శాస్త్రిని తన తండ్రిగా భావిస్తున్నట్లు చెప్పాడు.

అయితే తన గురువునే హర్ట్ చేశాడట క్రిష్.ఇంతకీ తను ఏ విషయంలో హర్ట్ అయ్యాడనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన సినిమా గమ్యం ద్వారా క్రిష్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.అనంతరం వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె లాంటి అద్భుత సినిమాలను తెరకెక్కించాడు.

దర్శకుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.రానా, నయనతార హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీతారామశాస్త్రి పాటలు రాశాడు.

ఇందులో 14 నిమిషాల నిడివిగల ఓ పాట ఉంది.

Telugu Krish, Krish Guru, Gamyam, Hariharaveera, Krushnamvande, Sirivennela, Son

అయితే ఈ పాటను పూర్తిగా వాడుకోలేకపోయిన్టుల క్రిష్ వెల్లడించాడు.దర్శకుడిగా మూడో సినిమానే కావడంతో ఎంత వాడుకోవాలో తెలియక పాటను కట్ చేసినట్లు చెప్పాడు.సినిమా అయ్యాక ఎడిటింగ్ మీదే ద్రుష్టిపెట్టి పాటలోని గొప్పతనాన్ని తాను గుర్తించలేకపోయానన్నాడు.

సినిమా లెన్త్ తగ్గించాలి అనుకోవడంతోనే పాటలోని పదాలను స్కిప్ చేసినట్లు చెప్పాడు.దీంతో తన గురువు గారు ఫీలైనట్లు చెప్పాడు.

Telugu Krish, Krish Guru, Gamyam, Hariharaveera, Krushnamvande, Sirivennela, Son

ఈ పాట నేపథ్యంలో తను కొద్ది రోజుల పాటు మాట్లాడలేదని క్రిష్ చెప్పాడు.ఆ తర్వాత కొంత కాలానికి మళ్లీ యథావిధిగా కలిసిపోయినట్లు చెప్పాడు.అటు తాను 10 మాటలు చెప్తే.11వ మాట కోసం వెయిట్ చేసే వ్యక్తి క్రిష్ అని సీతారామ శాస్త్రి చమత్కరించాడు.అటు గమ్యం, కంచె మాస్టర్ పీస్ అని శాస్త్రి అభివర్ణించాడు.ప్రస్తుతం క్రిష్ పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube