వ్యవసాయ రంగంలో( agriculture ) కూలీల కొరత కాస్త ఎక్కువగానే ఉండడంతో చాలామంది రైతులు కలుపు మొక్కల( Weeds ) నివారణకు అధిక మోతాదులో పిచికారీ మందులను( Injectable drugs ) ఉపయోగిస్తున్నారు.అయితే పిచికారీ మందులను తక్కువ మోతాదులో వాడాలని, ఈ పిచికారీ మందులు ప్రధాన పంటపై పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు( Agricultural experts ) సూచిస్తున్నారు.
కాబట్టి భూమిలో వేసే రసాయన ఎరువులైన, పిచికారీ మందులైన పొలంలో వేసేటప్పుడు వీటిపై సరైన అవగాహన ఉండాలని, తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకుంటేనే అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది.ముఖ్యంగా కలుపు నివారణ పిచికారి మందుల వల్ల పంటకు వచ్చే సమస్యలు ఏమిటో చూద్దాం.
కలుపు నివారణ పిచికారీ మందులు పిచికారీ చేసిన వెంటనే కలిగే నష్టం యొక్క లక్షణాలు బయటపడవు.కొద్ది రోజుల తర్వాత మొక్క ఎదుగుతున్నప్పుడు లేత ఆకులపై ఈ మందుల ప్రభావం కనిపిస్తుంది.ఆకులు వడదెబ్బ తగిలినట్టు పూర్తిగా ముడుచుకుపోవడం, ఆకులు కొమ్మలతో సహా వంగిపోవడం, వంకర్లు తిరగడం, కాండం అతిగా సాగినట్టు అవ్వడం లాంటివి జరుగుతాయి.అంతేకాకుండా ఆకుల పై భాగంలో బుడిపెలు ఏర్పడి వృద్ధి చెందుతాయి.
తర్వాత ఆకులు పసుపు రంగులోకి మారి తెలుపు రంగులోకి లేదా గోధుమ రంగులోకి మారతాయి.
కాబట్టి ఎప్పుడంటే అప్పుడు పిచికారీ మందులను కలుపు నివారణ కోసం వాడకూడదు.తప్పుడు ఫార్ములాను వాడకూడదు.వ్యతిరేక వాతావరణ పరిస్థితులలో పిచికారీ మందులు వాడకూడదు.
తక్కువ మోతాదులో వాడినా కూడా నష్టం జరిగే అవకాశం ఉంది.కాబట్టి పంట వేయకముందే పొలంపై కలుపు నివారణ పిచికారీ మందులతో పిచికారీ చేయాలి.
పొలం చుట్టూ ఉండే గట్లపై పిచికారీ చేయాలి.ప్రధాన పొలంలో సాళ్లు దూరంగా ఉంటే, పంట మొక్కలు ముదిరినప్పుడు ఆ మొక్కలకు తగలకుండా తక్కువ ప్రెజర్ తో పిచికారీ మందులు ఉపయోగించాలి.
కూలీల ధర కాస్త ఎక్కువైనా కూలీల చేతనే కలుపు తీపించేందుకు ప్రయత్నించాలి.కాబట్టి కలుపు నివారణ పిచికారీ మందులతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.
రైతులు వీటిపై అవగాహన కలిగించుకొని జాగ్రత్తగా ఉపయోగించి పంటను సంరక్షించుకోవాలి.