ఎండిన బోరు నుండి ఉబికి వస్తున్న నీరు

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం బాలెంల గ్రామ శివారులో మాజీ సర్పంచ్ మారేపల్లి ప్రభాకర్ వ్యవసాయ భూమిలో అరుదైన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఐదు సంవత్సరాల క్రితం ఎండిపోయిన బోరు నుండి మూడు రోజులుగా ఆగకుండా నీరు బయటికి వస్తుంది.

మోటార్ ఆన్ చేయకుండానే బోరు నుండి నీరు రావడంతో రైతులు, గ్రామస్తులు ఇదేమి చోద్యం అంటూ అక్కడికి వెళ్ళి చూస్తున్నారు.ఈ విధంగా జరగడానికి భూ అంతర్భాగంలో జరిగే చర్యలు కారణం కావచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

Latest Suryapet News