వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలి:సీపీఐ

సూర్యాపేట జిల్లా:వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలని,వారి పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ నిర్వహిస్తున్న దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలు గత 60 రోజులుగా సమ్మెలో పాల్గొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఉండటం సిగ్గుచేటన్నారు.సీఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

VRA Issues Should Be Resolved Immediately: CPI-వీఆర్ఏ సమస్�

వారికి పే స్కేల్ చెల్లించి,55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగుల అవకాశాలు కల్పించాలని కోరారు.ఈ దీక్షకు సిపిఐ జిల్లా పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనంతుల మల్లేశ్వరి,ఎల్లవుల రాములు,సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగనీ రవి,జిల్లా వీఆర్ఏల సంఘము కో చైర్మన్ మామిడి సైదులు,శ్రీనివాసులు,తండు నగేష్,సంతోష్ రెడ్డి, నజీర్,శ్రీను,నాగరాజు,రాజ్యలక్ష్మి,సైదమ్మ,సునీత, చైతన్య,సరిత,శ్రీను,నాగరాజు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News