ఆగష్టు 25న పాన్ ఇండియా సినిమాగా రిలీజైన లైగర్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన లైగర్ సినిమా విషయంలో డైరక్టర్ పూరీ కాలిక్యులేషన్స్ మిస్ అయ్యాయి.
అందుకే థియేట్రికల్ రన్ లో సినిమా నిరాశపరచింది.ఇక ఈ సినిమా నేడు డిజిటల్ రిలీజ్ అవుతుంది.
సినిమా డిస్నీ హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్ అవుతుంది.ఈ రిలీజ్ సందర్భంగా కూడా కొన్ని మేజర్ సైట్స్ లో పెయిడ్ ఆర్టికల్స్ వేయించారు.

అయితే ఇది మేకర్స్ వేయించినది కాదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కావాలని సినిమా కోసం రాయిస్తున్నారు.మరి ఫ్లాప్ అని తెలిసినా సరే ఈ ప్రమోషన్స్ ఎందుకు అనుకోవచ్చు.కొన్ని సినిమాలు ఫ్లాప్ అని తెలియగానే ఓటీటీలో చూద్దాం లే అనుకుంటారు.అలాంటి ఆడియన్స్ కోసం లైగర్ ఓటీటీలో రిలీజైందని చాటింపేసి చెబుతున్నారు.అంతేకాదు సినిమా సంచలనం అంటూ భారీ వ్యూస్ రాబట్టిందని కూడా వార్తలు రాస్తున్నారు.లైగర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో హిట్ అనిపించుకోవాలనే ఈ ప్రమోషన్స్ అన్ని అని టాక్.
మరి డిజిటల్ రిలీజ్ లో అయినా లైగర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.







