వైరల్: పాము, కుందేలు మధ్య పోటీ... ఎవరు గెలిచారో తెలిస్తే షాక్ అవుతారు?

నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది పరిపాటిగా మారింది.దాంతో సోషల్ మీడియా జోరు కూడా బాగానే పెరిగింది.

 Viral: The Competition Between Snake And Rabbit... Who Will Be Shocked To Know W-TeluguStop.com

ఇకపోతే ఈ సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో ముఖ్యంగా జంతువులకు సంబంధించినటువంటి వీడియోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఓ వీడియో ఆహుతులను బాగా అలరిస్తోంది.బేసిగ్గా మనం ఎక్కువగా పాము, ముంగిసల పోరును చూస్తుంటాం.

అయితే ప్రమాదకరమైన పాముతో, సాధుజంతువైన కుందేలు పోట్లాడడం మీరెప్పుడైనా చూశారా? అయితే ఇక్కడ వీడియో చూడండి.సదరు వీడియోలో ఒక కుందేలు ఏకంగా పాముపై యుద్ధానికి దిగింది.

పదే పదే దాడులు చేస్తూ పామును పరుగులు పెట్టించిన దాకా ఊరుకోలేదు.కుందేలు పోరు పడలేక చివరకు పాము అక్కడి నుంచి పారిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. claggies.v1 అనేపేరు గల ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు.

దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది.ఈవీడయోను చూసిన నెటిజన్లు కుందేలు ధైర్యానికి ఫిదా అవుతున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో పాము, కుందేలు మధ్య భీకర పోరు చూపరులను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తోంది.ఇక్కడ ఆశ్చర్యకరంగా కుందేలు వంటి సాధు జంతువు విషపూరిత పాముపై పదే పదే దాడులు చేయడం కాస్త విడ్డురంగా కనబడుతోంది అని చెప్పుకోవచ్చు.

పాము తప్పించుకోవాలని ప్రయత్నించినా విడిచిపెట్టదు.ఆఖరికి వెంబడించి వెంబడించి మరీ దానిపైన దాడి చేసింది.

దాంతో పాము నిస్సహాయంగా మారిపోతుంది.చివరకు తన ప్రాణాలు దక్కించుకునేందుకు వేగంగా అక్కడి నుంచి పారిపోతుంది.కాగా ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇది”కుందేలు దండయాత్ర అంటూ పూరీజగన్నాధ్ సినిమా టెంపర్ డైలాగ్స్ చెబుతున్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube