ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేయాలి:జిల్లా కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి మూడు నెలలకొకసారి సమావేశం ఏర్పాటు చేసి బాధితుల సమస్యలపై సత్వర చర్యలు చేపట్టి, పోలీస్,సంబంధిత అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్( S Venkata Rao ) ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటోరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్,అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,ఎస్.మోహన్ రావు తో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేలా కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు.జిల్లాలో 109 అట్రాసిటీ కేసుల పరిష్కారంలో భాగంగా ఇప్పటి వరకు 36 మందికి దాదాపు రూ.26 లక్షలు చెల్లించామని, సూర్యాపే( Suryapet )ట,కోదాడ సబ్ డివిజన్ల పరిధిలో 21 కేసులు వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్నాయన్నారు.ఈసమావేశంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్( RDO Rajendra Kumar ),డిఎస్డీఓ దయానంద రాణి,ఎస్సీ కార్పొరేషన్ ఈడి శిరీష, డిటీడీఓ శంకర్,డిఎస్పీలు నాగభూషణం,రవి,కమిటీ సభ్యులు సిహెచ్.

చిన్నరాములు, జి.సైదులు,ఎన్.ప్రకాష్ బాబు,జి.

Advertisement

అచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News