మిస్ యూనివర్స్ పోటీల జడ్జిగా ఊర్వశి రౌతేలా పారితోషికం ఎంతో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మోడల్ గా కేరీర్ ను ఆరంభించిన ఊర్వశి రౌతేలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

 Urvashi Rautela Paid Eight Crore As Remuneration For Miss Universe Competition J-TeluguStop.com

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.గతంలో అంతర్జాతీయ పోటీల్లో మెరిసి భారతదేశ పేరు ప్రఖ్యాతలను ప్రపంచానికి తెలిసేలా చేసింది ఈ బ్యూటీ.

ఈమె అందం అభినయంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.ఈమె అంద చందాలకు బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఈ పోటీల్లో జడ్జిగా పాల్గొని మరొకసారి భారతదేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేసింది.

ఈసారి మిస్ యూనివర్స్ గా భారతదేశం చంఢీ ఘడ్ కు చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.ఈ పోటీల్లో గెలిచేందుకు ఆమెకు అంతే ప్రైజ్ మనీ కూడా అందించారు.ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు ఊర్వశి దాదాపుగా 1.2 మిలియన్ల డాలర్లు పారితోషికంగా తీసుకుంది.అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలకు సమానం.

ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు భారత దేశం గర్వించేలా చేశారు అంటూ నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.గత రెండు వందల కోట్లతో త్వరలో నిర్మించబోయే ఒక సినిమా ద్వారా ఊర్వశి రౌతేలా తమిళ సినిమా రంగంలోకి అరంగ్రేటం చేయబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే మిస్ యూనివర్స్ వేడుకలలో ఆమె ధరించిన ఫ్రాక్ ఖరీదుతో మరొకసారి వార్తల్లో నిలిచింది.

ఈమె ధరించిన డ్రెస్ విషయంలో ఇప్పటికే పలుసార్లు సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే.ఊర్వశి ఎక్కువగా డైమండ్స్ ఉన్న దుస్తులను ధరిస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube