ఎఫ్‌డీఐ సమ్మిట్‌కు ముందు కీలక పరిణామం.. యూకేకు 37 బిలియన్ల విదేశీ పెట్టుబడులు, రిషి సునాక్‌కు భారీ ఊరట

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌( Rishi Sunak ) ప్రధానంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందు ఆయన కీలక ప్రకటన చేశారు.ప్రైవేట్ రంగంలో బ్రిటన్‌కు( Britain ) 29.5 బిలియన్ పౌండ్లు (36.8 యూఎస్ డాలర్ల) పెట్టుబడులు వచ్చినట్లు సునాక్ తెలిపారు.యూరప్‌లో అగ్రశ్రేణి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా యూకేని మార్చేందుకు గాను సునాక్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ సమ్మిట్‌( Global Executive Summit ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 Uk Rishi Sunak Hails Usd 37 Billion Investments Before Fdi Summit Details, Uk, R-TeluguStop.com

గత వారం తమ ప్రభుత్వం ప్లాంట్ అండ్ మెషినరీని ఆధునీకరించడానికి వ్యాపార సంస్థలకు శాశ్వత పన్ను మినహాయింపులను ప్రకటించినట్లు రిషి సునాక్ తెలిపారు.ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంతో పాటు బ్రిటన్‌లో నెలకొన్న అస్థిరమైన ఆర్దిక వ్యవస్ధను వేగవంతం చేయడానికి సహాయపడుతుందని ఆయన ఆకాంక్షించారు.

క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, అధునాతన టెక్నాలజీ వంటి పరిశ్రమలకు నిధులు అందడం వల్ల బ్రిటన్‌లో కొత్త ఉద్యోగాలు వస్తాయని రిషి సునాక్ చెప్పారు.

Telugu Aware, Fdi Summit, Iberdrola, Ifm Investors, Microsoft, Rishi Sunak, Uk E

ఆస్ట్రేలియన్ ఫండ్స్ ఐఎఫ్ఎం ఇన్వెస్టర్లు,( IFM Investors ) అవేర్ సూపర్‌లు( Aware Super ) వరుసగా 10 బిలియన్ పౌండ్లు, 5 బిలియన్ పౌండ్లను బ్రిటన్ మౌలిక సదుపాయాలు, ఇంధన పరివర్తన, గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెట్టనున్నారని 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రకటించింది.స్పానిష్ పవర్ దిగ్గజం ఐబెర్‌డ్రోలా( Iberdrola ) బ్రిటన్‌లో ట్రాన్స్‌మిషన్ , డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రిసిటీ నెట్‌వర్క్‌లపై 7 బిలియన్ పౌండ్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.అలాగే మైక్రోసాఫ్ట్.( MircoSoft ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 2.5 బిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టనుంది.

Telugu Aware, Fdi Summit, Iberdrola, Ifm Investors, Microsoft, Rishi Sunak, Uk E

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆకర్షించడం , ఆర్ధిక వ్యవస్ధను వృద్ధిలోకి తీసుకువెళ్లడం నా ప్రణాళికలో ప్రధానమైనదని రిషి సునాక్ చెప్పారు.బ్రిటన్ ఇతర దేశాల మాదిరిగానే సొంతంగా నిధులు సమకూర్చుకోలేని మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ప్రైవేట్ రంగ పెట్టుబడులను కోరుతోంది.అయితే 2016 నాటి బ్రిగ్జిట్ రెఫరెండం కారణంగా ప్రేరేపించబడిన రాజకీయ నియంత్రిత అనిశ్చిత కారణంగా ఇటీవల కాలంలో బ్రిటన్‌కు పెట్టుబడుల ఆకర్షణ తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదే సమయంలో ఇతర దేశాలు ఎఫ్‌డీఐల విషయంలో మరింత ఆకర్షణీయంగా మారాయని చెప్పారు.

అత్యధిక సంఖ్యలో కొత్త ఎఫ్‌డీఐ ప్రాజెక్ట్‌లతో బ్రిటన్‌ను ఫ్రాన్స్ అధిగమించింది.ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ఏడాది మేలో నిర్వహించిన ఎఫ్‌డీఐ సమావేశంలో ఫ్రాన్స్‌కు 13 బిలియన్ యూరోల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించారు.

అకౌంటెన్సీ సంస్థ ఈవై ప్రకారం.ఎఫ్‌డీఐల ఆకర్షణల విషయంలో ఫ్రాన్స్, జర్మనీలతో పోలిస్తే బ్రిటన్ వెనుకబడే వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube