ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ పాన్ ఇండియా కథలతో ఎంత దూసుకుపోతుందో తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు.
అంతేకాదు మంచి మాస్ కథలతో తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే పలు పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి.
ఇక టాలీవుడ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒక్కమాటలో చెప్పాలంటే ఎగబడుతున్నారు.వాళ్ళంత టాలీవుడ్ పై తెగ ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది.బాలీవుడ్ కథలలో డిమాండ్ పోయినట్టు ఉంది.అందుకేనేమో బాలీవుడ్ సినీ నటి నటులు వరుసగా టాలీవుడ్ పై ఒక కన్నేసారు.ఇక తెలుగు సినీ పరిశ్రమలు కథల విషయంలో మంచి మసాలా కనిపిస్తుంది.
అంతేకాదు ఇక డైరెక్టర్ ల విషయంలో ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే మంచి మంచి కథల తో టాలీవుడ్ లో ఒక ఆట ఆడేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి పలువురు డైరెక్టర్లు ప్రస్తుతం ఇండియా సినిమాలతో బాగా బిజీగా మారారు.స్టార్ హీరోలతో వరుస ఆఫర్లతో ప్రాజెక్టులను ఓకే చెప్పారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్, హీరోల రేంజ్ మాత్రం బాలీవుడ్ పై బాగానే తగిలిందని చెప్పవచ్చు.అంతే కాకుండా పారితోషికం విషయంలో టాలీవుడ్ బాగా ముందుకొచ్చింది.
ఇదిలా ఉంటే కొందరు బాలీవుడ్ నటులు టాలీవుడ్ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట్లీ తో ఓ సినిమా చేస్తున్నాడు.
అంతేకాకుండా మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం ఓ స్టార్ డైరెక్టర్ ఏకంగా కథని రాసుకుంటున్నారని తెలిసింది.ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.