ఓకే స్టేషన్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్...!

సూర్యాపేట జిల్లా:అక్రమ రవాణాను అరికట్టాల్సిన రక్షకభట వృత్తిలో ఉండి, ఇసుక అక్రమ రవాణాకు అనధికార లైసెన్స్ ఇస్తూ వారి వద్ద నుండి నెల నెలా మామూళ్లు దండుకుంటూ భక్షకభటులుగా మారారనే ఆరోపణలపై శాఖా పరమైన విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ ఆరోపణలు నిజమని తేలడంతో ఓకే స్టేషన్ కు చెందిన ముగ్గురు ఖాళీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఉదంతం సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది.

సూర్యాపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహిస్తున్న ఎం.

రాంబాబు, ఎం.బాలకృష్ణ,ఎల్.పూర్ణచందర్ అనే ముగ్గురు ఖాకీలు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని విచారణలో రుజువు కావడంతో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సిబ్బంది ఎవరైనా విధులు నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

Latest Suryapet News