గంజాయి,దొంగతనం కేసులలో నింధితులుగా ఉన్న వారు వారి నెరప్రవృతిని మార్చుకోవాలి...

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ ( Gambhiraopet Police Station )పరిధిలో గతంలో గంజాయి, దొంగతనం కేసులలో పట్టుబడిన వారికి ఈ రోజు స్టేషన్ పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించి తమ తమ నెరప్రవృతిని మార్చుకొని సత్ప్రవర్తనతో మేధాలలని లేనియెడల హిస్టరీ షీట్స్, పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

అనంతరం ఎస్పీ( District SP Akhil Mahajan ) మాట్లాడుతూజిల్లాలో గతంలో గంజాయి, దొంగతనం కేసులలో ఉన్న పాత నెరస్థులపై పోలీస్ నిఘా ఎప్పుడు ఉంటుందని, వారు తమ తమ నెరప్రవృతిని మార్చుకొని సత్ప్రవర్తనతో మేధాలలని లేనియెడల హిస్టరీ షీట్స్, పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు.

జిల్లాలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని,గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని,జిల్లాలో గంజాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, డ్రంక్ & డ్రైవ్ తరహాలో గంజాయి కిట్లతో తనిఖీలు చేస్తున్నామని, గంజాయి పాజిటివ్ వచ్చిన వారి నుంచి సరఫరా దారులను పట్టుకుంటున్నామని తెలిపారు.అనంతరం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకొని, డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్నారు.సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని,గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు.

Advertisement

ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ రామ్మోహన్ ,సిబ్బంది పాల్గొన్నారు.

భారతదేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్నలను కాపాడుకుని ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
Advertisement

Latest Rajanna Sircilla News