గంజాయి అనుమానితులకు టెస్ట్ లు నిర్వహించిన పోలీసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామపంచాయతీ ఆవరణలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గంజాయి సేవించారనే అనుమానంతో కొందరు యువకులను టెస్ట్ లు చేశారు.

 Police Conducted Tests For Cannabis Suspects ,police , Rajanna Sirisilla Distri-TeluguStop.com

గంజాయి రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా ఇటీవల ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహా గంజాయి( Cannabis ) టెస్ట్ మిషన్లను అందుబాటులో ఉంచారు.

గంజాయి సేవించిన వ్యక్తులను టెస్ట్ కిట్ల ద్వారా గుర్తించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు.

గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ఇందూరి రవి, ఓదెలు, తదితరులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube