గంజాయి అనుమానితులకు టెస్ట్ లు నిర్వహించిన పోలీసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామపంచాయతీ ఆవరణలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గంజాయి సేవించారనే అనుమానంతో కొందరు యువకులను టెస్ట్ లు చేశారు.

గంజాయి రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా ఇటీవల ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహా గంజాయి( Cannabis ) టెస్ట్ మిషన్లను అందుబాటులో ఉంచారు.

గంజాయి సేవించిన వ్యక్తులను టెస్ట్ కిట్ల ద్వారా గుర్తించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు.

గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ఇందూరి రవి, ఓదెలు, తదితరులు ఉన్నారు.

తెలుగు ప్రేక్షకులు బకరాలు అనుకుంటున్నారా.. విజయ్ “గోట్” సినిమా ఏం చెప్తుంది?