నన్ను తిట్టేవారికి నా వార్నింగ్ ఇదే !  హెచ్చరించిన పవన్ 

రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena chief Pawan Kalyan ) స్పీడ్ పెంచారు.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలు రచిస్తున్నారు.

 This Is My Warning To Those Who Insult Me Pawan Warned Details, Pavan Kalyan, Ja-TeluguStop.com

ముఖ్యంగా తమ ప్రధాన రాజకీయ శత్రువైన వైసీపీ( Political enemy YCP ) పై జనాల్లో ఆదరణ తగ్గించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తూ, తన ప్రసంగాల్లో ఘాటును మరింతగా పెంచారు.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర( Varahi Yatra in East Godavari district ) చేపడుతున్న పవన్ కళ్యాణ్ తమ ప్రధాన రాజకీయ శత్రువైన వైసిపి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

రాబోయేది తమ ప్రభుత్వమేమని చెబుతూ, వార్నింగ్ లు ఇస్తున్నారు.వైసీపీ నాయకులు తిడుతున్న తిట్లను తాను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని, వారి మాటలకు చేతలతో సమాధానం చెబుతానంటూ పవన్ వార్ణింగ్ ఇచ్చారు.

ఎవరైతే తనని తిట్టారో భవిష్యత్తులో వారితోనే మేము చింతిస్తున్నాను అని చెప్పిస్తానని పవన్ అన్నారు.

Telugu Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Pawankalyan, Varahi, Varahiyatra,

మీసాలు మేలయడం, తొడలు కొట్టడాలు వంటివి తాను సినిమాల్లో కూడా చేయనని పవన్ అన్నారు.ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే తాను జన వాహిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వంపై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేశారని, కాకినాడలో ప్రశ్నించిన పాపానికి ఒక మహిళ మానసిక స్థితి బాగోలేదని చెబుతున్నారని, ఏపీలో యువతకు ఉపాధి లేదని పవన్ విమర్శించారు.జగన్ గెలిచాక ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే ఆయనకు ఫోన్ లో తాను మనస్పూర్తిగా అభినందనలు చెప్పానని, అంతేకాదు మీ వ్యక్తిగత జీవితం, విషయాల గురించి తాను ఎప్పుడు మాట్లాడానని, కానీ తన ఇంట్లో ఉన్న నాలుగేళ్ల బిడ్డను కూడా వదలకుండా తిట్టించారని, అంత తప్పు తాను ఏం చేశానని పవన్ ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు తాము గెలిచేందుకు ఎన్ని వ్యూహాలనైనా అమలు చేస్తానని పవన్ అన్నారు.వారాహి యాత్రకు విశేషమైన స్పందన వస్తోందని, ఆ స్పందన చూసే వైసిపి నాయకులు భయాందోళన చెందుతూ.

జనసేనపై విమర్శలతో విరుచుకుపడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube