గ్యాస్‌ కేవైసికి చివరి తేదీ అంటూ ఏదీ లేదు: అదనపు కలెక్టర్‌ ఎ.వెంకట్‌రెడ్డి

సూర్యాపేట జిల్లా: గ్యాస్‌ కేవైసి నమోదుకు చివరి తేదీ అంటూ లేదని, లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ ఏ.

వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయిల్‌ కంపెనీ ఏజెన్సీల నిర్వహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్యాస్ కేవైసి పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు.కేవైసి నమోదు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సాధరణ పక్రియని,ఈ విషయాన్ని ఏజెన్సిలు వినియోగదారులకు తెలుపాలన్నారు.

There Is No Last Date For Gas KYC Additional Collector A Venkat Reddy, , Gas Kyc

కేవైసి నమోదు సమయంలో సురక్ష పైపులను బలవంతంగా అంటగట్టవద్దని,అవసరం ఉన్న వారు పైపులను కొనుగోలు చేసుకొవచ్చన్నారు.రూ.500 సిలిండర్‌ సరఫరాపై ప్రభుత్వం నుంచి ఏలాంటి ఆదేశాలు రాలేదని,కేవైసీ నమోదుకు ఈ పథకానికి సంబంధం లేదని ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్‌వో మోహన్‌బాబు,సివిల్‌ సప్లయ్‌ అధికారులు, గ్యాస్‌ డిస్టిబ్యూటర్లు తదితరులు పాల్గోన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దేశ్ ముఖ్ రాధిక
Advertisement

Latest Suryapet News