మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ”గేమ్ ఛేంజర్” ( Game Changer ).రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ( RRR movie ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా గ్లోబల్ వైడ్ గా తన ఖ్యాతిని పెంచుకున్నాడు.
అందుకే ఇంతకు ముందు కంటే యూఎన్ సినిమాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఈ ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో చేయి కలిపాడు.ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళింది.

కానీ వివిధ కారణాల వల్ల షూట్ పూర్తి కాలేదు.ఇక ఇప్పుడు శరవేగంగా షూట్ ను పూర్తి చేస్తున్నారు.ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇప్పటికి ఇంకా రిలీజ్ చేయనేలేదు.కానీ ఆలస్యం అవుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.మరి ఇటీవలే మైసూర్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.కాగా ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్ లో జరపబోతున్నట్టు టాక్.అంతేకాదు ఈ షెడ్యూల్ లో పాల్గొనే నటీనటులకు షూటింగ్ రోజు సెట్స్ కు వెళ్లే వరకు కూడా ఆ రోజు ఎవరితో ఏ సీన్ చేస్తారు అనేది తెలియదట.
అక్కడికి వెళ్లిన తర్వాతనే శంకర్ వారికీ సీన్స్ వివరిస్తారని తెలుస్తుంది.మొత్తానికి శంకర్ పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.