ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ‘వారాహి విజయ యాత్ర’ సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.ఎక్కడ చూసిన ఈ యాత్ర గురించే చర్చ.
మిగిలిన రాజకీయ పార్టీలు లాగ కాకుండా పవన్ కళ్యాణ్ ఈ యాత్ర ద్వారా వైసీపీ పార్టీ ప్రభుత్వం లో తలెత్తుతున్న వైఫల్యాలను ఒక్కొక్కటిగా ఎత్తి చూపుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.వాటిని గమనించిన తర్వాత సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వైసీపీ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.
కత్తిపూడి సభతో ప్రారంభమైన ఈ యాత్ర, నిన్న కాకినాడ వరకు సాగింది.నిన్న జరిగిన కాకినాడ సభ లో పవన్ కళ్యాణ్ ఆ స్థానిక MLA ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ( Chandra Shekhar Reddy )పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే.
ద్వారంపూడి చరిత్ర మొత్తం రౌడీ రాజకీయమే అని, ఆయన తాతగారు గతం లో ఇలాగే చేస్తే కాకినాడ లో TP నాయక్ అనే SI తన జీపుకు కట్టేసి కాకినాడ వీధులు మొత్తం తిప్పించాడని, ఈసారి జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వారంపూడి ని కూడా అలాగే చేయిస్తా అంటూ పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపింది.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పార్టీ నాయకులు మొత్తం చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ద్వారంపూడి చంద్ర శేఖర్ మాట్లాడుతూ ‘నా ఇంటి మీదకి మీ జనసైనికులు , వీరమహిళలు దాడి చెయ్యడానికి వచ్చారు.ఇంటి మీదకు దాడి చెయ్యడానికి వస్తే ఎవరైనా చూస్తూ కూర్చుంటారా, అయినా నేను వాళ్ళ మీద తిరిగి దాడి చేయించలేదు, మా వాళ్ళు వాళ్ళని పక్కనే ఉన్న గుడిలో వేసి బంధించారు.
మా అనుచరులు గన్ పట్టుకొని తిరుగుతున్నారట.నువ్వు గన్ పట్టుకొని తిరుగుతున్నావని, నీ కూతురు నీపై కేసు పెట్టింది, రౌడీ వి నువ్వా నేనా’ అంటూ ద్వారంపూడి పవన్ కళ్యాణ్ పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.
మరో పక్క మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.
ఆయన మాట్లాడుతూ ‘పవన్ కల్యాణే పెద్ద రౌడీ మరియు గూండా, ఆయన వెనుక ఉన్న వాళ్లంతా రౌడీలే గూండాలే, ఒక్కరైనా సక్రమంగా ఉన్నారా వారిలో?, పవన్ కళ్యాణ్ గురించి వెతికితే ఆయన మీద కూడా రౌడీ కేసులు ఉండొచ్చేమో’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది.పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి కి కాస్త సన్నిహితంగా ఉండే వారిలో ఒకరు బొత్స సత్యనారాయణ.పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘తీన్ మార్’ చిత్రం ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా విచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా కూడా మాట్లాడాడు.
ఆయన గురించి వ్యక్తిగతం గా అన్నీ తెలిసి కూడా ఇలాంటి కామెంట్స్ ఎలా చెయ్యగలిగావు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడుతున్నారు.