ప్రపంచంలోనే అత్యంత స్లోగా నడిచే రైలు గురించి మీకు తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు స్విట్జర్లాండ్‌లో క‌నిపిస్తుంది.ఈ రైలు పేరు గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్.

 The Worlds Slowest Train Runs In This Country Details, Worlds Slowest Train , Wo-TeluguStop.com

గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ రైలు స్విట్జర్లాండ్‌లోని ఎత్తైన కొండలపై నడుస్తుంది.ప్రపంచంలోనే అత్యంత నెమ్మదైన ఈ రైలు స్విట్జర్లాండ్‌లోని రామర్ట్ .సెయింట్ మోరిట్జ్ స్టేషన్ల మధ్య నడుస్తుంది.నిజానికి ఇది ఎక్స్‌ప్రెస్ రైలు, దీనివేగం సాధారణ రైళ్ల కంటే ఎక్కువగా ఉండాలి.

కానీ దీనికి భిన్నంగా ఇది న‌డుస్తుంది.ఈ రైలు వేగం గంటకు 29 కిలోమీటర్లు.

అంటే, గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 290 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల్లో కవర్ చేస్తుంది.ఈ కారణంగానే గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా న‌డిచే ఎక్స్‌ప్రెస్ రైలుగా పిలుస్తుంటారు ఈ రైలు 1930 సంవత్సరంలో ఎత్తైన కొండల మధ్య ప్రారంభమ‌య్యింది.

మొద‌ట్లో ఈ రైలు వేసవి కాలంలో మాత్రమే నడిచేది.ఎందుకంటే ఈ రైలు నడిచే ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది.అందుకే మంచు కొండల్లో జ‌న‌సంచారం ఉండేదికారు.అప్పట్లో ఈ రైలులో ప్యాసింజర్ కోచ్‌లు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎత్తైన కొండల మధ్య ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా ఉండేదికాదు.అయితే కాలక్రమేణా దీనికి అనేక మెరుగులుదిద్దారు.

Telugu Glacier Express, Switzerland, Worldsslowest-General-Telugu

ఇది స్లో రైలు కావడం దేశానికి గర్వకారణంగా మారింది.కానీ ఈ హోదా పొందిన తర్వాత ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ రైలులో ఎంజాయ్ చేయ‌డం ప్రారంభించారు.రైలు ప్రయాణంలో దాదాపు 290 కి.మీ.మార్గంలో మంచు కొండలు కనిపిస్తాయి.అదే సమయంలో, ఈ రైలు 91 సొరంగాలు మరియు 291 వంతెనల గుండా వెళుతుంది.

ఇది అందరినీ అమితంగా ఆక‌ట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube