సైదిరెడ్డి జారీ చేసిన విప్పు చెల్లదు:కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావుపై ఈ నెల 24 న అవిశ్వాసానికి రంగం సిద్దం కావడంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి జారీ చేసిన విప్ చెల్లదని మూడోవ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి అన్నారు.

మున్సిపాలిటీలో దాదాపు 1/3 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని,నల్గొండ మరికొన్ని చోట్ల ఇదే విధంగా పాలకవర్గం చైర్మన్లు వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెడితే విప్ లు జారీ చేశారని,అయినా ఆ విప్ లు పరిగణలోకి తీసుకోకుండానే అవిశ్వాసాలు పెట్టడం,నెగ్గడం కూడా జరిగిందని గుర్తు చేశారు.

కోర్టులకు పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులు వాటిని అంగీకరించలేదని,అవిశ్వాసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.

The Resolution Issued By Saidireddy Is Invalid Councilor Kothi Sampath Reddy , K

Latest Suryapet News