పాలకుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తున్న జిల్లా ప్రజలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి( National Highway ) 8 కి.మీ.

ఉండగా కేవలం 2 కి.మీ.మాత్రమే ఫ్లై ఓవర్ నిర్మాణం చేసి వదిలేయడంతో నిత్యం జాతీయ రహదారి రక్తసిక్తమై ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.జిల్లా కేంద్రం దాటే వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం ఉంటే ఫోర్ వే పై స్పీడ్ గా వచ్చే వాహనాలకు కింద నుండే వెళ్ళే వాహనాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోయేది.

The People Of The District Are Paying The Price For The Negligence Of The Rulers

కానీ, పాలకులు దీనిని పెడచెవిన పెట్టిన కారణంగానే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి.ప్రజల ప్రాణాలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా పాలకులు ఆడుతున్న రాజకీయ క్రీడలో సగటు మనిషి విగత జీవిగా మారిపోతున్నాడు.

వేల కోట్ల రూపాయలు పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్దం కావడం లేదని జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడం వరకే పరిమితం కాకుండా కనీసం ఈ పాలకులైనా జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సూర్యాపేట జిల్లా( Suryapet District ) కేంద్రంతో పాటు జిల్లా పరిధిలో యాక్సిడెంట్స్ స్పాట్స్ గా డేంజర్ బెల్స్ మోగిస్తున్న జాతీయ రహదారిపై జంక్షల వద్ద ఫ్లై ఓవర్స్ నిర్మాణం చేసి అండర్ పాసింగ్ ఏర్పాటు చేస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుందని,రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

Advertisement

జిల్లా కేంద్రంలోని 65వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు,మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.

కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం అనుభవించే నరకం పాలకులకు ఎందుకు అర్దం కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయి ఫ్లై ఓవర్ ఉండి ఉంటే ఇంత మంది కుటుంబాల్లో విషాదం నిండేదా? ప్రజల ప్రణలంటే ప్రభుత్వాలకు అంత చులకనా? ప్రజల అవసరాలను తీర్చేందుకు ఓట్లేసి పాలకులను ఎన్నుకుంటే అధికారాన్ని అనుభవిస్తూ ప్రజలను గాలికొదిలేసి,రాజకీయాలు చేయడం ఏమిటని మండిపడుతున్నారు.ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు పెద్దలు,ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులుమేలుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో దురాజ్ పల్లి నుండి రాయినిగూడెం వరకూ పూర్తిస్థాయిలో ఫ్లై ఓవర్ నిర్మాణం చేసి, జిల్లాలో ప్రధాన జంక్షన్లలో అండర్ పాసింగ్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

లేకుంటే ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో మరిన్ని చుడాల్సి వస్తుందని,ఇంకా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ
Advertisement

Latest Suryapet News